NTV Telugu Site icon

Insta Reel: ఇన్‌స్టా రీల్ కోసం ఫ్లైఓవర్‌పై కారు ఆపాడు.. రూ.36,000 జరిమానా కట్టాడు..

Dhilhi Flay Over

Dhilhi Flay Over

Insta Reel: నార్త్ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఓ వ్యక్తి ఓవర్‌ ఆక్ష్సన్‌ చేశాడు. దానికి స్పందించిన పోలీసులు అతనికి భారీ జరిమానా విధించి కారును సీజ్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. నగరంలో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్‌పై కారును ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. దీంతో ఢిల్లీ పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.36,000 జరిమానా విధించారు. నిందితుడి పేరు ప్రదీప్ ఢాకా అని, పోలీసులపై దాడికి కూడా ప్రయత్నించాడని పోలీసులు వివరించారు.

నిందితుడు ప్రదీప్ కారును సీజ్ చేసి అతడిపై మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ సమయంలో ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌లోని ఫ్లైఓవర్‌పై కారును ఆపి వీడియోలు చిత్రీకరించి, డోర్ తెరిచి కారును నడిపినట్లు పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా పోలీసుల బారికేడ్లకు నిప్పంటించి వీడియోలు తీశాడని వివరించారు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్‌పై కేసు నమోదు చేయడానికి దారితీసిన వీడియోలను ఢిల్లీ పోలీసులు పంచుకున్నారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అతడిని అరెస్టు చేసినట్లు వివరించారు. ప్రదీప్ ఉపయోగించిన కారు అతని తల్లి పేరు మీద రిజిస్టర్ అయిందని, ఆ కారులో కొన్ని నకిలీ ప్లాస్టిక్ ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.

Read also: Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య!

అసలేం జరిగిందంటే..

నార్త్ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇద్దరు యువకులు తమ కారును ఆపి లోపలికి లాగారు. ప్రదీప్ ఢాకా పోస్ట్ చేసిన వీడియోలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో యువత తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. పాపులారిటీ కోసం చేసే ఇలాంటి వారికి జైలుశిక్షతోపాటు వారి వాహనాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానా విధించాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన నార్త్ ఢిల్లీ పోలీసులు వారిని పట్టుకుని కేసు నమోదు చేసి, జరిమానా విధించారు.

Tillu Square: బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్.. కలెక్షన్స్ ఎంతంటే..!