NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో కారు బీభత్సం.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో యువకుడి మృతి

Delhicaraccident

Delhicaraccident

దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కారు ఓ వ్యక్తిని ఢీకొట్టి 10 మీటర్లు లాక్కెడంతో చనిపోయాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత పారిపోయిన కారు డ్రైవర్‌ను మరుసటి రోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: RG Kar Hospital: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిపై మరో ఆరోపణ..వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు బలి?

మధ్యప్రదేశ్‌కు చెందిన దూబే బుధవారం కన్నాట్ ప్లేస్‌లో ఒకరిని కలవడానికి దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని స్నేహితుడి నుంచి కారును తీసుకున్నాడని అధికారి తెలిపారు. మధ్యాహ్నం 3.25 గంటలకు తిరిగి వస్తుండగా కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ దగ్గర బరాఖంబా రేడియల్ రోడ్డు సమీపంలో రోడ్డు దాటుతున్న లేఖరాజ్‌ (45)ను కారు ఢీకొట్టింది. లేఖరాజ్ కారు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. అయితే దూబే కారు ఆపకుండా నడుపుతూనే ఉన్నాడని అధికారి తెలిపారు. సుమారు 10 మీటర్లు ఈడ్చుకెళ్లిన తర్వాత లేఖరాజ్‌ను రోడ్డుపై వదిలి దూబే అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Assam: 3 వారాల తర్వాత గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుల అరెస్ట్

కన్నాట్ ప్లేస్ ప్రాంతం నుంచి పారిపోయిన తర్వాత.. దూబే తన స్నేహితుడికి కారును తిరిగి అప్పగించాడు. సీసీటీవీలను పరిశీలించి కారు యజమానిని గుర్తించారు. తదనంతరం దూబేని అరెస్టు చేసి భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

ఇది కూడా చదవండి: Actor Darshan: జైల్లో టీవీ కోసం రిక్వెస్ట్.. అంగీకరించిన అధికారులు

Show comments