Site icon NTV Telugu

Dogs Attack: కుక్కల దాడిలో వ్యక్తి మృతి.. వార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో..

Dog Attack

Dog Attack

Dogs Attack: ఇటీవల దేశంలో చాలా ప్రాంతాల్లో కుక్కల దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా కుక్కల దాడులకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు వీటికి ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మార్నింగ్ వాక్ వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేసి చనిపోయే వరకు కరిచి చంపాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read Also: Harish Rao: కర్ణాటక ఎన్నికలపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ప్రభుత్వమే రావాలంటూ..

ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపర్ లో డాక్టర్ సప్ధర్ అలీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ వచ్చాడు. అక్కడే నిలబడి వ్యాయామం చేస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వేగం వచ్చిన కుక్కలు ఆయనపై దాడి చేయడం ప్రారంభించాయి. ముందుగా ఓ కుక్క దాడి చేయగా.. ఆ తరువాత 10 వీధి కుక్కల గుంపు ఆయనపై దాడి చేశాయి. ఎంత విడిపించుకుందాం అని అనుకున్నా కూడా అతడి వల్ల కాలేదు. పదేపదే దాడి చేయడంతో పాటు నోటితో ఈడ్చుకెళ్లాయి. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడిక్కడే మరణించాడు.

అటుగా వెళ్తున్న కొందరు సప్ధర్ అలీ మరణించి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అతను ఎలా చనిపోయాడనే విషయంపై ఆరా తీసిన పోలీసులు అక్కడే ఉన్న సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా కుక్కలు భయంకరంగా దాడులు చేయడాన్ని చూశారు.

Exit mobile version