వైరల్: మొబైల్ చూస్తూ.. రైలు పట్టాలపై పడిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరికి మొబైల్ చేతిలో ఉంటే చాలు… వేరే లోకం అవసరం లేదు. మొబైల్ చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలకు గురయ్యేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్ పట్టాలపై పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల శైలేందర్ మెహతా శుక్రవారం మరో చోటకు వెళ్లేందుకు షాహదారా మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. అయితే ఫ్లాట్‌ఫారంపై అటు ఇటు నడుస్తూ అతడు ఫోన్ చూడటంలో బిజీ అయ్యాడు. దీంతో గమనించకుండా ఫ్లాట్‌ఫారం అంచుకు వెళ్లి కింద ఉన్న రైలు పట్టాలపై పడ్డాడు.
మరోవైపు మెట్రో రైలు స్టేషన్‌లోకి వస్తుండటంతో… ఫోన్‌లో బిజీగా ఉండి పట్టాలపై పడిన శైలేందర్ మెహతా పైకి లేవలేకపోయాడు. గమనించిన సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్ రోతాష్ చంద్ర వెంటనే అతడి వద్దకు చేరుకుని… శైలేందర్‌ను ఫ్లాట్‌ఫారంపైకి లాగారు. అనంతరం మెట్రో రైలు స్టేషన్‌లోకి వచ్చింది. కాగా ఈ ఘటన సీసీ టీవీలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియోను సీఐఎస్‌ఎఫ్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. మెట్రో రైలు పట్టాలపై పడిన సదరు వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది.
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
A passenger namely Mr. Shailender Mehata, R/O Shadhara, slipped and fell down on the metro track @ Shahdara Metro Station, Delhi. Alert CISF personnel promptly acted and helped him out. #PROTECTIONandSECURITY #SavingLives@PMOIndia @HMOIndia @MoHUA_India pic.twitter.com/Rx2fkwe3Lh
— CISF (@CISFHQrs) February 5, 2022
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?