NTV Telugu Site icon

Interesting News: రూ. 60 దొంగతనం.. 30 ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు..

Crime

Crime

Interesting News: తమిళనాడు మధురైలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 1997లో రూ.60ని దొంగిలిచిన వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక పోలీసుల బృందం గుర్తించింది. శివకాశికి చెందిన 55 ఏళ్ల పన్నీర్ సెల్వం అనే వ్యక్తిని మధురై జిల్లా పోలీసులు అరెస్ట్ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును గుర్తించేందుకు అసిస్టెంట్ కమిషనర్ సూరకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Read Also: “Dog” Remark: ‘‘నిరాశ నుంచి నిరుత్సాహానికి’’.. కాంగ్రెస్ చీఫ్ ‘‘కుక్క’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

పరారీలో ఉన్న నిందితులపై ప్రత్యేక సబ్‌ఇన్‌స్పెక్టర్లు సంతానపాండియన్‌, పన్నీర్‌సెల్వన్‌ నేతృత్వంలో బృందం దృష్టి సారించింది.ఈ కేసు 1997లో తెప్పకులం అనే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడిని నుంచి పన్నీర్ సెల్వం రూ. 60ని దొంగిలించి పరారీలో అయ్యాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఇటీవల జక్కతొప్పును సందర్శించిన సమయంలో, పనీర్ సెల్వం శివకాశి వెళ్లినట్లు గుర్తించారు. పెళ్లి చేసుకున్న నిందితుడు రహస్య జీవితాన్ని గడిపాడు. జనాభా సర్వేయర్ల ముసుగులో వెళ్లిన పోలీసులు అతడి కుటుంబాన్ని వివరాలు అడిగారు. గుర్తింపు నిర్ధారించుకున్న తర్వాత, నేరం జరిగిన 27 ఏళ్లకు వ్యక్తిని అరెస్ట్ చేశారు.