Man Acquitted In Rape Case Seeks ₹ 10,000 Crore Damage For 2-Year Jail: అత్యాచారం కేసులో తనను అన్యాయంగా రెండేళ్లు శిక్షించారని ఏకంగా ప్రభుత్వంపైనే కేసు పెట్టాడు ఓ వ్యక్తి. నిర్దోషిని అయిన తనను రెండేళ్ల పాటు శిక్షించాలని ప్రభుత్వం తనకు రూ. 10,006.02 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోరాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లామ్ కు చెందిన ఓ వ్యక్తి సామూహిక అత్యాచారం ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే రెండేళ్ల పాటు శిక్ష అనుభవించాడు. తన కుటుంబానికి బాధ కలిగించినందుకు, ఆకలితో అలమటించేలా చేసినందుకు, తనకు బాధ, మానసిక ఆవేదన కలుగచేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరాడు.
Read Also: Errabelli Dayakar Rao : దేవాదుల పనులు వేసవి కాలంలోపు పూర్తి కావాలి
కాంతు అలియాస్ కాంతిలాల్ భీల్(35)పై నమోదు అయిన ఆరోపణలను స్థానిక కోర్టు ఉపసంహరించుకుంది. అయితే తనను అన్యాయంగా శిక్షించారని ఆరోపిస్తూ ఆయన సెషన్స్ కోర్టును ఆశ్రయించినట్లు అతని న్యాయవాది విజయ్ సింగ్ యాదవ్ తెలిపారు. ఈ కేసులు జనవరి 10న విచారణకు రానుంది. ఈకేసు గురించి కాంతిలాల్ భీల్ మాట్లాడుతూ.. మానవ జీవితం ఎంతో విలువైనదని దాన్ని కోల్పోయినందుకు రూ. 10,000 కోట్లు,రూ.6.02 కోట్లు న్యాయపరమైన ఖర్చులకు, రూ.2 లక్షలు మానసిక వేధనకు పరిహారం కోరుతున్నట్లు వెల్లడించారు.
ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే.. తప్పుడు సామూహిక అత్యాచారం ఆరోపణల కింది కాంతిలాల్ భీల్ పై 2018 జూలై 20న ఓ మహిళ కేసు పెట్టింది. తన అన్న ఇంటి వద్ద దింపుతానని చెబుతూ కాంతులాల్ భీల్ తనపై అత్యాచారం చేశాడని.. ఆ తరువాత వేరే వ్యక్తికి అప్పగించాడని..అతను ఆరు నెలల పాటు తనపై అత్యాచారం చేశాడని ఆరోపపణలు చేసింది. డిసెంబర్ 23, 2020న సామూహిక అత్యాచారం కేసులో భీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రెండేళ్ల పాటు జైలులో ఉంచారు. తన కుటుంబానికి తానే ఆధారం అని అరెస్ట్ సమయంలో భీల్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. వృద్ధురాలు అయిన తల్లి, భార్య, ముగ్గురు పిల్లలకు తానే ఆధారం అని తెలిపాడు. తాజాగా ఈ కేసు ఉపసంహరించుకోవడంతో భీల్ కు ఉపశమనం లభించింది.
