NTV Telugu Site icon

Mamata Banerjee: బీఎస్ఎఫ్‌పై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..

Mamata Banerjee

Mamata Banerjee

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాక్యలు చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అనుమతిస్తుందని గురువారం ఆరోపించారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ ప్లాన్ కేంద్రం యొక్క ‘‘నీచమైన బ్లూ ప్రింట్’’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ బెంగాల్‌లోకి చొరబాట్లను అనుమతిస్తోందని, మహిళలను హింసిస్తోందని ఆరోపించారు.

‘‘బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు’’ బెంగాల్‌లో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కొన్ని రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల తర్వాత మమత నుంచి తాజా కామెంట్స్ వచ్చాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ అంశం టీఎంసీ-బీజేపీ మధ్య చర్చనీయాంశంగా మారింది.

Read Also: Nimisha Priya case: యెమెన్‌లో నిమిషా ప్రియాకు మరణశిక్ష.. రక్షించేందుకు ఇరాన్ సాయం..

‘‘బీఎస్ఎఫ్ వివిధ ప్రాంతాల నుండి బెంగాల్‌లోకి చొరబాట్లను అనుమతిస్తోంది మరియు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తోంది, టీఎంసీ సరిహద్దులను కాపాడటం లేదు కదా, సరిహద్దు మన చేతుల్లో లేదు, కాబట్టి ఎవరైనా టీఎంసీ చొరబాట్లను అనుమతించిందని ఆరోపిస్తే, అది బిఎస్ఎఫ్ బాధ్యత అని నేను ఎత్తి చూపుతాను.’’ అని మమతా బెనర్జీ అన్నారు. చొరబాట్లను అనుమతించే ప్రాంతాలను దర్యాప్తు చేసి గుర్తించాలని డీజీపీని ఆదేశిస్తానని చెప్పారు.

పోలీసుల వద్ద సమాచారం ఉందని, కేంద్ర వద్ద కూడా ఉందని, ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌తో మాకు శత్రుత్వం లేదు, కానీ ఇక్కడ గుండాలను అనుమతించి, వారు నేరాలకు పాల్పడిన తర్వాత సరిహద్దు దాటుతున్నారని, బీఎస్ఎఫ్ ఇదంతా చేస్తుందని, దీంట్లో కేంద్రం పాత్ర ఉందని ఆరోపించారు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య 4096 కి.మీ సరిహద్దు కలిగి ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ చొరబాట్లకు బెంగాల్ నర్సరీగా మారిందని అన్నారు. ఓట్ల కోసం మమతా బెనర్జీ ఇలా చేస్తున్నారని, బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యాలకు బెంగాల్ గేట్‌వేగా మారిందని అన్నారు.

Show comments