Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- మమతా బెనర్జీ పార్టీలో విభేదాలు..
- నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) భారీ ఓటమిని చవిచూసింది. ఇక ఆ పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత టీఎంసీ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా, టీఎంసీలో చీలిక వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం టీఎంసీ తొలిసారిగా భారీ నిరసన ప్రదర్శన చేసింది. ఈ కార్యక్రమానికి టీఎంసీ ఎమ్మెల్యేలు చాలా మంది రాలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఎన్నికల తర్వాత చెలరేగిన రాజకీయ హింస, వీధి వ్యాపారుల ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ టీఎంసీ బుధవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 35 మంది మాత్రమే హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తీవ్ర విభేదాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. దీనికి ముందు కోల్‌కతాలోని కాళీఘాట్‌లో టీఎంసీ ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ హాజరైనట్లు సమాచారం.
Also Read
బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఎంసీ ప్రధాన నాయకులు సోవన్ దేబ్ చటోపాధ్యాయ్, నయన బెనర్జీ, కునాల్ ఘోష్, రీటాబ్రత బెనర్జీ వంటి వారు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ యాక్షన్‌పై నిరసన తెలిపారు. అయితే, పార్టీలోని సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు శోవన్‌దేబ్ చటోపాధ్యాయ్ పార్టీలో విభేదాలను ఖండించారు. మారుమూల నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు చేరుకోవడం ఆలస్యమైందని కవర్ చేశారు.
తాజావార్తలు
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!