NTV Telugu Site icon

Tilapia Fish: తిలాపియా చేప వివాదం.. క్యాన్సర్ పుకార్లపై మమతా బెనర్జీ..

Tilapia Fish

Tilapia Fish

Tilapia Fish: తిలాపియా చేపలు తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందనే పుకార్ల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పుకార్లను తోసిపుచ్చిన మమతా, ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా తినాలని పిలుపునిచ్చారు. ‘‘తిలాపియా చేప తినడం వల్ల శరీరంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఉందా..?’’ అని రాష్ట్ర సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో అధికారులను ఆమె ప్రశ్నించారు.

Read Also: Raj Tarun: 10 ఏళ్ల క్రితమే పెళ్లి.. అబార్షన్లు.. మారు పేరుతో విదేశీ ట్రిప్పులు.. రాజ్ తరుణ్ కేసులో సంచలనాలు

ఈ పుకార్లకు తగిన ఆధారాలు తేవని అధికారులు నిర్ధారించిన తర్వాత, ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “నిరభ్యంతరంగా తిలాపియా తినండి. ఈ చేపను తింటే క్యాన్సర్ రాదు. ఈ తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేశారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అని ముఖ్యమంత్రి అన్నారు. ‘జల్ భరో, జల్‌ధారో’ పథకం కింద టిలాపియా చేపలను చెరువుల్లోకి వదలాలని ఆమె బ్యూరోక్రాట్‌లను ఆదేశించారు.