Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mamata Banerjee Refuses Resignation Denies Defeat Blames Ec Bjp Bengal

Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన

Published Date :May 5, 2026 , 5:14 pm
By Suresh Maddala
  • మమత సంచలన ప్రకటన
  • ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ప్రకటన
  • దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వ్యాఖ్యలు
Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కూడా కలవను. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది.’’ అని మమత ఆరోపించారు.

ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ‘‘మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. గెలవడానికి బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుంది. ఎన్నికల సంఘమే అతి పెద్ద విలన్.’’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Also Read

  • Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
  • Viral: మమతా బెనర్జీ నన్ను రూ.5 కోట్లు అడిగింది.. ప్రముఖ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
  • Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు
  • TVK Vijay: దళపతి విజయ్ కులం ఏంటి..? గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారుగా..

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా.. టీఎంసీ 80 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. ఈ ఫలితాలపై మమత మీడియా వేదికగా మాట్లాడుతూ ఈసీపై మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుందని వ్యాఖ్యానించారు.

‘‘మా పోరాటం బీజేపీతో కాదు. ఎన్నికల సంఘంతో. నా జీవితంలో ఇలాంటి ఎన్నికను చూడలేదు. 2004 తర్వాత ఇంతటి అఘాయిత్యాలను చూడలేదు. ఎన్నికల సంఘమే ప్రధాన విలన్. ఎస్ఐఆర్ నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారు. బీజేపీ 100 సీట్లను దొంగిలించింది. మమ్మల్ని ఓడించడానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారు. మమ్మల్ని ఓడించడానికి బీజేపీ సాధ్యమైన ప్రతీ ఎత్తుగడను ఉపయోగించింది. బీజేపీ కార్యకర్తలు మా కార్యకర్తలపై దాడి చేశారు.’’ అని ఆరోపించారు.

కూటమి అండ..
‘‘ఇండియా కూటమి నాకు అండగా ఉంది. సోనియా గాంధీ, రాహుల్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, హేమంత్ సోరెన్, తేజస్వి యాదవ్ అందరూ నాకు ఫోన్ చేశారు. కూటమి నాకు అండగా ఉంది. అఖిలేష్ యాదవ్ రేపు బెంగాల్ వస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.

‘‘ఇప్పుడు నేను స్వేచ్ఛా పక్షిలా ఉన్నాను. నాకు చేయాల్సిన పని ఉంది. కానీ మేము పోరాటం ఆపం. బీజేపీ అప్పుడే ప్రజలను హింసించడం మొదలుపెట్టింది. వారు షెడ్యూల్డ్ కుల, షెడ్యూల్డ్ తెగల కుటుంబాలపై కూడా దాడి చేశారు. వారిపై అత్యాచారం చేస్తామని బీజేపీ బెదిరించింది. బీజేపీ తన గూండాలతో దాడులు మొదలుపెట్టింది. పోలీసులు చేతులు కట్టుకుని కూర్చున్నారు. మాకు మార్పు కావాలి. ప్రతీకారం కాదు అనే నినాదాన్ని మేము లేవనెత్తాము. ఇది సైనికుల దళమా లేక గూండాల దళమా?.’’ అని మమత ప్రశ్నించారు.

మీడియాపై ధ్వజం
మొదటి విడత ఓట్ల లెక్కింపు తర్వాత… బీజేపీ ఇన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటూ మీడియా వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టిందని.. అంతే వెంటేనే బీజేపీ గూండాలు తనపై దాడి చేశారని ఆరోపించారు. ‘‘నా వీపుపైనా, కడుపుపైనా తన్నారు.’’ అని మమత పేర్కొన్నారు.

#WATCH | Kolkata: Outgoing West Bengal CM Mamata Banerjee says, "After first round of counting, they started saying that BJP is getting 195-200. You didn't wait for the final result. You didn't even wait for 5-6 rounds. After that campaign with the press media, BJP went inside… pic.twitter.com/e72Bcs8Dpj

— ANI (@ANI) May 5, 2026

#WATCH | Kolkata: Outgoing West Bengal CM Mamata Banerjee says, "Sonia ji, Rahul Gandhi, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejashwi Yadav, Hemant Soren rang me up. All the allies of INDIA Alliance told me that they are totally and absolutely with me. I think our… pic.twitter.com/W8ZRWMP1d2

— ANI (@ANI) May 5, 2026

#WATCH | Kolkata: Outgoing West Bengal CM Mamata Banerjee says, "Sad to say, CEC became the villain of this election to loot the democratic rights of the people and to loot the EVM. Can you tell me that after voting EVM has 80-90% charge? How is it possible? Two days before the… pic.twitter.com/b9Dc1npwWq

— ANI (@ANI) May 5, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengal election controversy
  • Bengal politics news
  • BJP West Bengal results
  • Election Commission row India
  • Indian Politics Updates

తాజావార్తలు

  • Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?

  • Viral: మమతా బెనర్జీ నన్ను రూ.5 కోట్లు అడిగింది.. ప్రముఖ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

  • Palathalikalu Recipe : రుచికరమైన పాలతాలికలు.. పక్కా కొలతలతో తయారీ విధానం ఇలా..!

  • Mamata Banerjee: నేను ఓడిపోలేదు.. రాజీనామా చేసే ప్రసక్తేలేదు.. మమత సంచలన ప్రకటన

  • Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions