Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో ఉగ్రవాద నెట్వర్క్‌లు పనిచేస్తున్నాయని అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పహల్గాం దాడిని కేంద్రమే చేసిందా? అని మమత ప్రశ్నించారు. బెంగాల్‌లోని బంకురాలోని బిర్సింగ్‌పూర్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను మహాభారత ఇతిహాసంలోని ఇద్దరు ప్రతినాయకులైన దుశ్శాసన, దుర్యోధనులుగా అభివర్ణించారు.
Read Also: India-Pakistan war: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.! : యూఎస్ రిపోర్ట్..
‘‘శకుని శిష్యుడైన దుశ్శాసనుడు సమాచారం సేకరించడానికి బెంగాల్‌కు వచ్చాడు. ఎన్నికలు రాగానే ఈ దుశ్శాసన, దుర్యోధనులు ప్రత్యక్షమవుతారు’’ అని ఆమె అన్నారు. బెంగాల్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందన్న హోంమంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ, మమత ఎదురుదాడికి దిగారు, “జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు లేకపోతే, పహల్గాం ఎలా జరిగింది? పహల్గాంలో దాడిని మీరే చేశారా? ఢిల్లీలో జరిగిన సంఘటన వెనుక ఎవరున్నారు?” అని అడిగారు.
బెంగాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా ప్రక్రియపై మమత విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. రాజ్‌బన్షీలు, మతువాలు, ఆదివాసీలు వంటి అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ కింద 1.5 కోట్ల మంది పేర్లను తొలగించాలని యోచిస్తున్నారని ఆమె అన్నారు. దీని ద్వారా బెంగాలీల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
