Site icon NTV Telugu

Mamata Banerjee: కాంగ్రెస్‌ వల్లే మోడీ గెలిచారు.. పుస్తకావిష్కరణలో మమత వ్యాఖ్య

Mamatabanerjee

Mamatabanerjee

కాంగ్రెస్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు  చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు. కోల్‌కతాలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అనంతరం స్వయంగా రాసిన మూడు పుస్తకాలను విడుదల చేశారు. ఆమె రాసిన పుస్తకాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల తీరుపై విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తీరును ఎండగట్టారు.

ఇది కూడా చదవండి: Saudi Arabia: సౌదీలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసి సహా 15 మంది మృతి

లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసిందని.. కాంగ్రెస్ వైఫల్యం కారణంగా ఇండియా కూటమి ఓడిపోవల్సి వచ్చిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని.. చివరికి కూటమిలో ఉన్న పార్టీలే ఒకరిపై ఒకరు పోటీ చేశారు. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చిందన్నారు. కన్నీసం ఉమ్మడి కార్యక్రమం గానీ.. ఉమ్మడి మేనిఫెస్టో కార్యరూపం దాల్చదని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమిలోని వైఫల్యాలు బీజేపీకి కలిసొచ్చాయని.. చివరికి మెజార్టీ లేకున్నా మోడీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిందని పుస్తకంలో వివరించారు.

ప్రస్తుతం ఇండియా కూటమి మనుగడ అంతంత మాత్రంగానే ఉంది. కూటమిలోని పార్టీలకు పడడం లేదు. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఆప్‌కే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఒంటరైపోయింది. ఇలా కూటమిలోని పార్టీలకు పొసగడం లేదు.

ఇది కూడా చదవండి: Parasakthi: ఒకే టైటిల్ తో ఒకే రోజు సినిమాలు అనౌన్స్ చేసిన స్టార్ హీరోలు

Exit mobile version