Parasakthi: ఒకే టైటిల్ తో ఒకే రోజు సినిమాలు అనౌన్స్ చేసిన స్టార్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. పరాశక్తి పేరుతో సినిమా రాబోతోంది అంటూ ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమానే. సాధారణంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే ముందుగా సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలంటే ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయించుకుని ఉండాలి. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ల వరకు ఆ టైటిల్ మరే సినిమాకు కేటాయించకుండా ఫిలిం ఛాంబర్ జాగ్రత్తలు తీసుకుంటుంది.
Nara Lokesh: 8వ తరగతి విద్యార్థులు ఏడో తరగతి పుస్తకాలు చదవడం లేదు.. దీనికి గత ప్రభుత్వమే కారణం..
Also Read
ఇద్దరు తమిళ హీరోలు, ఇద్దరూ తమిళ సినిమాలని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి తమిళ సినీ పరిశ్రమలో ఈ టైటిల్ రిజిస్టర్ చేశారా? అక్కడ ఒక టైటిల్తో ఇక్కడ ఒక టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారా? లేక అక్కడ కూడా టైటిల్ క్లాష్ అయిందా? అనే విషయం ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమా టీమ్స్ లో ఏదో ఒక టీం ఈ విషయం మీద స్పందిస్తే కానీ అసలు ఏం జరిగిందనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కల్పించడం లేదు.. విజయ్ ఆంటోనీతో పాటు శివ కార్తికేయాన్ కి కూడా ఇప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ ఇద్దరి సినిమాలను తెలుగులో బాగానే చూస్తున్నారు కాబట్టి చేస్తున్న దాదాపు అన్ని తమిళ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసేందుకు ఇద్దరు ఆసక్తి కనబరుస్తున్నారు.
తాజావార్తలు
-
Korean Kanakraju: నైజాం, వైజాగ్ రైట్స్ కొన్న దిల్ రాజు
-
Ram Charan : రామ్ చరణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
-
CJP Protest: సీజేపీ నిరసనల్లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెకు లైంగిక వేధింపులు..
-
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!