Mamata Banerjee: ఎలక్షన్ షెడ్యూల్ ముందు.. హిందూ, ముస్లిం ఓట్ల కోసం మమతా కీలక నిర్ణయం..
- ఎన్నికల షెడ్యూల్ మందు మమతా బెనర్జీ కీలక నిర్ణయం.. పురోహితులు, ముజ్జిన్‌ల గౌరవవేతనం పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కేంద్రం ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 4 గంటలకు నాలుగు రాష్ట్రాలు- తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం-పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చే కొన్ని గంటల ముందు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ఐదు అసెంబ్లీల పదవీకాలం మే నెలలో ముగుస్తుంది. షెడ్యూల్ తర్వాత ఆయా రాష్ట్రాలు, యూటీలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఈలోపే హిందూ, ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంగా మమతా బెనర్జీ ఆలయాల పూజారులు, ముజ్జిన్‌లకు చెల్లించే నెలవారీ గౌరవవేతాన్ని రూ. 500లకు పెంచినట్లు ప్రకటించారు. ‘‘మా పూజారులు, ముజ్జిన్‌లకు చెల్లించే నెలవారీ గౌరవ వేతనాన్ని రూ. 500 పెంచినట్లు ప్రకటించడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారి సేవ మన సమాజాల ఆధ్యాత్మిక మరియు సామాజిక జీవితాన్ని నిలబెట్టింది. ఈ సవరణతో, వారు ఇప్పుడు నెలకు రూ.2,000 అందుకుంటారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో పురోహితులు, ముజ్జిన్‌లు సక్రమంగా సమర్పించిన అన్ని కొత్త దరఖాస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు ఆమె ప్రకటించారు. సమాజాంలో మతపరమైన కార్యకర్తల్ని పోషించే పాత్రను గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రతీ సమాజంలో, ప్రతీ సంప్రదాయాన్ని విలువైనదిగా, బలోపేతం చేసే వాతావరణాన్ని పెంపొందించడంలో మేము గర్విస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే కొద్ది గంటల ముందు ఆమె ఈ ప్రకటన చేయడాన్ని ప్రతిపక్షాలు ఓటర్లను ఆకట్టుకునే ట్రిక్‌గా విమర్శి్స్తున్నారు.
I am pleased to announce an increase of ₹500 in the monthly honorariums extended to our purohits and muezzins, whose service sustains the spiritual and social life of our communities. With this revision, they will now receive ₹2,000 per month.
At the same time, all fresh…
— Mamata Banerjee (@MamataOfficial) March 15, 2026
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!