NTV Telugu Site icon

Mamata Banerjee: హిందువులపై హింస.. యూఎన్‌కి మమతా బెనర్జీ పిలుపు..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల అణిచివేత జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రముఖ హిందూ నేతల్ని అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్ల కారణంగా షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశవ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. గుడులు, హిందూ వ్యాపారాలు, ఇళ్లపై దాడులు చేస్తూనే ఉన్నారు.

Read Also: PM Modi-Putin: భారత్‌లో పర్యటించండి.. పుతిన్‌కి మోడీ ఆహ్వానం..

ఇదిలా ఉంటే, హిందువులపై జరుగుతున్న దాడుల గురించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాన్ని ఆ దేశంలో మోహరించాలని సూచించారు. పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించాలని ప్రధాని నరేంద్రమోడీని ఆమె కోరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆమె హిందువుల దాడిని ఖండించారు. “కులం, మతం లేదా మతంతో సంబంధం లేకుండా ఏ రకమైన దురాగతాలను మేము ఖండిస్తున్నాము. బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక బృందాన్ని పంపాలని కూడా నేను సూచిస్తున్నాను. ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి బంగ్లాదేశ్‌ పరిణామాలను పట్టించుకోవాలి” అని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనలు కొనసాగితు, మేము మా ప్రజల్ని తీసుకురావాలని అనుకుంటున్నాము, వారికి ఎలాంటి ఆహార కొరత రాదని నేను హామీ ఇస్తుున్నానని మమతా బెనర్జీ అన్నారు.

ఇటీవల ఆ దేశంలో ప్రముఖ హిందూ మత గురువు చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేయడం వివాదంగా మారింది. దీనిపై భారత్ కూడా స్పందించింది. మైనారిటీలకు రక్షణ కల్పించాలని అక్కడి ప్రజల్ని కోరింది. హిందూ హక్కుల గురించి మాట్లాడిన చిన్మోయ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన మద్దతుదారుల్ని కూడా అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడి యూనస్ ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.