Site icon NTV Telugu

Mamata Banerjee: టీఎంసీ తొలి జాబితా విడుదల.. మమతా బెనర్జీ పోటీ ఎక్కడ్నుంచంటే..!

Mamatabanerjee1

Mamatabanerjee1

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 294 స్థానాలకు గాను 291 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ భబానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇప్పటికే బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించేసింది. సువేందు అధికారిని భబానీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల నుంచి పోటీకి దింపింది. గతంలో నందిగ్రామ్‌లో సువేందు అధికారిపై మమత ఓటమి చెందారు. ప్రస్తుతం మమత భబానీపూర్ నుంచి బరిలోకి దిగారు. ఈసారి భబానీపూర్ నుంచే పోటీ చేస్తారా? మరొక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అన్నది సస్పెన్ష్‌గా ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 152, 142 స్థానాలకు రెండు దశల వారీగా పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం మే 4న జరగనుంది.

ఇక అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందు మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభ్యర్థుల జాబితాను ప్రకటించే ముందు నేను బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను బీజేపీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరెందుకు భయపడుతున్నారు? మీరు పోరాడాలనుకుంటే గ్యాస్ సంక్షోభం సృష్టించకండి. సరైన పద్ధతిలో క్షేత్రస్థాయికి రండి. ఎన్నికల సంఘం, మీరు ఒక అద్భుతమైన ఆట ఆడారు. బీజేపీకి అవకాశం లేదు. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం మీకు సీట్లు తగ్గుతాయి. ఇది పశ్చిమ బెంగాల్ అస్తిత్వ పోరాటం. బెంగాల్ గెలుస్తుంది. ‘‘ఢిల్లీ కా లడ్డూ’’ గెలవదు.’’ అంటూ మమత వ్యాఖ్యానించారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను సువేందు అధికారి ఓడించారు. మరోసారి సువేందు అధికారిని నందిగ్రామ్, భబానీపూర్ నుంచి బీజేపీ బరిలోకి దింపింది. బీజేపీ తొలి జాబితాలో 144 మంది అభ్యర్థులను ప్రకటించింది.

Exit mobile version