Rajya Sabha: దేశ ప్రయోజనాలపై ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వరా? కేంద్రంపై ఖర్గే ఫైర్

  • పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం
  • అధికార-ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల-తూటాలు
  • దేశ ప్రయోజనాలపై ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వరా?
  • కేంద్రంపై మల్లిఖార్జున ఖర్గే ఫైర్
Mallikarjun Kharge

Mallikarjun Kharge

పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార-ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రతిపక్ష సభ్యులంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అంశం కుదిపేస్తోంది. లోక్‌సభ, రాజ్యసభల్లోనూ విపక్ష నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్‌లో కమల్‌హాసన్ వార్నింగ్

ఇక గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతల్ని మాట్లాడానివ్వడం లేదని.. దేశ ప్రయోజనాలపై మాట్లాడాలనుకుంటే మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ఇలా ఎలా సభను నడుపుతారని ఖర్గే ప్రశ్నించారు.

దీనికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘‘లోక్‌సభ కార్యకలాపాల గురించి రాజ్యసభలో చర్చించకూడదని ప్రతిపక్ష నాయకుడు ఖర్గేకు తెలియదా?’’ అని అన్నారు. అయినా రాహుల్‌గాంధీకి పరిపక్వత లేదని.. అమాయక పిల్లోడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో నడ్డా వ్యాఖ్యలను ఖర్గే తిప్పికొట్టారు.