Site icon NTV Telugu

Malegaon blast case: మాలేగావ్ కేసులో మోడీ, యోగిని ఇరికించాలని కాంగ్రెస్ కుట్ర: ప్రజ్ఞా ఠాకూర్

Pragya Thakur

Pragya Thakur

Malegaon blast case: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌‌ను ఎన్ఐఏ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ATS) తనను తీవ్రంగా హింసించిందని బీజేపీ మాజీ ఎంపీ ఆరోపించింది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేవని చెప్పింది.

ఈ కేసులో ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లను చెప్పాలని, ఏటీఎస్ తనను చిత్రహింసలకు గురిచేసి, బలవంతం చేసిందని ఆమె ఆరోపించారు. వీరి పేర్లు చెబితే మిమ్మల్ని కొట్టమని చెప్పేవారని, వారి ప్రధాన లక్ష్యం తనను హింసించడమే అని ఠాకూర్ శనివారం విలేకరులతో అన్నారు. తనను చట్టవిరుద్ధంగా 13 రోజులు ఉంచారని, వారి కస్టడీలో 24 రోజుల పాటు హింసించారని అన్నారు.

Read Also: PM Modi: “బ్రహ్మోస్ క్షిపణి” శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రపట్టదు..

ఇది కాంగ్రెస్ కుట్ర, ఇది ఇప్పుడు బహిర్గతమైంది. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. ఈ సారి కూడా అది గెలిచింది. భారతదేశానికి ప్రాథమిక స్తంభాలు అయిన సాధువులు, ఆర్ఎస్ఎస్, సైన్యాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంటుంది’’ అని ఆమె ఆరోపించింది. భవిష్యత్తులో దేశం కోసం చేయగలిగిందంతా చేస్తానని, మొత్తం కేసును కాంగ్రెస్ తప్పుగా బనాయించిందని, ఈ కేసు నిరాధారమైందని, కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల్ని గౌరవంగా చూస్తోందని, కాంగ్రెస్ దేశాన్ని ప్రేమించే పార్టీగా మారదు అని ఠాకూర్ అన్నారు.

ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఈ కేసును సహేతుకమైన సందేహాలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొంది. ఈ కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహిర్కర్, సుధాంకర్ ధర్ ద్వివేది (శంకరాచార్య), సమీర్ కులకర్ణి సహా నిందితులను నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చెల్లించాలని కూడా కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 29, 2008 నాటిది, మాలేగావ్ నగరంలోని భిక్కు చౌక్‌లోని ఒక మసీదు సమీపంలో మోటార్‌సైకిల్‌‌లో ఉంచిన బాంబు పేలి ఆరుగురు మరణించారు. 95 మంది గాయపడ్డారు.

Exit mobile version