Maldivian President Muizzu: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లడం గౌరవంగా భావిస్తున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldivian President Muizzu: ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి అధికారం నిలుపుకుంది. ఈ ప్రమాణస్వీకార వేడుకులకు ఇండియా ఇరుగుపొరుగు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, సీషెల్స్ ఇలా పలు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత సంబంధాలు మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం వేదిక కాబోతోంది.
Read Also: AIADMK: బీజేపీతో పొత్తు ఉండదు.. తేల్చి చెప్పిన పళనిస్వామి..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ కూడా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తనకు గౌరవంగా భావిస్తున్నాని, చారిత్రాత్మక ఘట్టం కోసం ఆయన తొలిసారిగా భారత్‌లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలు ‘సానుకూల దిశ’లో సాగుతున్నాయని నిరూపిస్తుందని శనివారం ముయిజ్జూ అన్నారు. భారత ఆహ్వానాన్ని ప్రెసిడెంట్ ముయిజ్జూ అంగీకరించిన తర్వాత ఆ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది నవంబర్ 17న పదవీ బాధ్యతలు చేపట్టిన ముయిజ్జై భారత వ్యతిరేక, చైనా అనుకూల విధానాలతో వార్తల్లో ఉంటున్నాడు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను తమ దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు. ఇదే కాకుండా ఈ ఏడాది ప్రధాని లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ముయిజ్జూ కేబినెట్ మంత్రులు, ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదమైంది. అప్పటి నుంచి భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ ద్వీపదేశం సాయం కోసం భారత్‌ని అభ్యర్థించడం మొదలుపెట్టింది.
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!