Site icon NTV Telugu

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

Bommai

Bommai

Karnataka: రానున్న రోజుల్లో కర్ణాటకలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై గురువారం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మారారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు నిధులు లేవని, ప్రజల్ని ఎదుర్కొనేందుకు వారు సిగ్గుపడుతున్నారని చెప్పారు. పరిపాలన అధ్వాన్నంగా ఉందని, అధికారులు ప్రభుత్వం మాట వినడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే స్థాయికి చేరిందని బొమ్మై అన్నారు.

Read Also: NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్‌‌లపై కేంద్రమంత్రి..

రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలలో అసంతృప్తికి సంబంధించి బీజేపీ ఎంపీ గోవిండ్ కార్జోల్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఉన్నాయని, కార్జోల్ సీనియర్ నేత అని, అతను పూర్తి సమాచారంతో మాట్లాడుతారని మాజీ సీఎం అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరల పెంపుపై దావణగెరెలో జరిగిన భారీ నిరసన కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. కాంగ్రెస్ ధరల పెంపుతో సమాన్య ప్రజలు, పేదలపై భారం పడుతుందని అన్నారు. పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు పెంచడం ద్వారా పాలించే నైతిక అధికారాన్ని కోల్పోయారని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి పేద, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని బొమ్మై ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని, కర్ణాటకని పదేళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం హామీల పేరుతో పేదలపై భారం మోపిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ. 1.05 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని చెప్పారు. మొదట్లో మోటార్ పన్ను, మద్యం పన్ను, స్టాంపు డ్యూటీ పన్ను పెంచిందని, ఇప్పుడు పెట్రోల్, డిజిల్ ధరల్ని పెంచిందని అన్నారు.

Exit mobile version