Site icon NTV Telugu

Maithili Thakur: బీజేపీలోకి మైథిలి ఠాకూర్, బీహార్ ఎన్నికల్లో పోటీ.. ఈమెకు ఇంత క్రేజ్ ఎలా.?

Maithili Thakur

Maithili Thakur

Maithili Thakur: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీహార్‌లో వ్యాప్తంగా మైథిలి జానపద సింగర్‌గా ఈమెకు పేరుంది. బీహార్ ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఆమె గతంలో చెప్పింది.

Read Also: Employees: ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

ఈ నెల ప్రారంభంలో మైథిలి ఠాకూర్, ఆమె తండ్రి న్యూఢిల్లీలో బీహార్ బీజేపీ ఇన్‌చార్జ్ వినోద్ తావ్డే, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌లను కలిశారు. సోషల్ మీడియా ఎక్స్‌లో తావ్డే ఆమెను ‘‘బీహార్ పుత్రిక’’ అంటై సంబోధించారు. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది.

ప్రస్తుతం అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మిశ్రీలాల్ యాదవ్‌ సీటు కోల్పోవడం దాదాపుగా ఖాయమైంది. ఈ సీటు నుంచి యువకురాలు, ప్రజాదరణ పొందిన వ్యక్తిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. మైథిలి ఠాకూర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బీజేపీ ఈమెను తన ప్రచారానికి వాడుకోవచ్చు. మైథిలి ఠాకూర్ గెలిస్తే, బీహార్ జానపద సంస్కృతితో సంబంధం ఉన్న ప్రఖ్యాత గాయని నేరుగా రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అవుతుంది.

మైథిలి ఠాకూర్ ఎవరు?

మైథిలి బీహార్‌కు చెందిన ప్రసిద్ధ గాయని. దర్భంగాకు చెందిన ఈమె మైథిలి జానపద సంగీతంతో ఫేమస్ అయింది . విదేశాలలో మైథిలి కచేరీలను కూడా నిర్వహిస్తుంది. 25 ఏళ్ల గాయని తన మిథిలా సంస్కృతిని ప్రజలకు తెలియజేస్తోంది. మైథిలి తండ్రి రమేష్ ఠాకూర్, తల్లి భారతి ఠాకూర్‌లు కూడా మైథిలి సంగీతకారులు.

ఇద్దరూ మ్యూజిక్ టీచర్లుగా పనిచేస్తున్నారు. మైథిలికి ఇద్దరు సోదరులు ఉన్నారు, వీరు కూడా సంగీత వృత్తిని కొనసాగిస్తున్నారు. ముగ్గురు కూడా హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. 1995లో లాలు ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్‌ను విడిచిపెట్టిన మైథిలి కుటుంబాన్ని తిరిగి బీహార్ రావాలని ఇటీవల బీజేపీ నేతలు ఆహ్వానించారు.

Exit mobile version