Site icon NTV Telugu

Mahindra cars: మహీంద్రా గుడ్ న్యూస్, కొత్త జీఎస్టీకి ముందే తగ్గిన కార్‌ల ధరలు..

Mahindra Cars

Mahindra Cars

Mahindra cars: ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి రాబోతోంది. దీని ఫలితంగా, కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లక్షల్లో డబ్బు ఆదా కాబోతోంది. పెట్రోల్ కోసం 1,200cc మరియు డీజిల్ కోసం 1,500cc మించని ఇంజిన్ సామర్థ్యం కలిగిన 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్‌లను చిన్న కార్లుగా చెబుతారు. గతంలో ఈ కార్లపై 28 శాతం జీఎస్టీ ప్లస్ 1 శాతం సెస్ ఉంటే, ఇప్పుడు 18 శాతం పరిధిలోకి ఈ కార్లు రాబోతున్నాయి. 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉండీ, పెట్రోల్ 1200 సీసీ, డీజిల్ 1500 కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజన్లు కలిగిన కార్లకు 40 శాతం జీఎస్టీ, సెస్సు లేకుండా విధించబడింది. గతంలో వీటికి 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్సు ఉండేది.

Read Also: Bowel Cancer: షాకింగ్ అధ్యయనం.. మాంసం, మద్యం తాగే యువతకు పెద్దపేగు క్యాన్సర్..!

ఈ నేపథ్యంలో పలు కార్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే టాటా సంస్థ, తగ్గబోతున్న జీఎస్టీ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. తాజాగా, దేశీయ ఆటోకార్ మేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా సంచలన ప్రకటన చేసింది. సవరించిన జీఎస్టీ అమలోకి రాకముందే, సెప్టెంబర్ 6 నుంచే ప్రయోజనాలను అందిస్తామని ప్రావిస్ చేసింది. ఈ మేరకు తమ కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మోడల్ ఆధారంగా కొనుగోలుదారులకు రూ. 1.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. బొలెరో నియో, థార్, XUV3XO వంటి ఎస్‌యూవీలు మరింత సరసమైన ధరలకు లభించున్నాయి. ‘‘ప్రామిస్ చేయడమే కాదు, చేసి చూపిస్తాం. థాంక్యూ మహీంద్రా ఆటో’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఏ కారుపై ఎంత ధర తగ్గిందంటే..

*బొలెరో నియో- రూ. 1.27 లక్షలు
*XUV3XO (పెట్రోల్)- రూ. 1.40 లక్షలు
*XUV3XO ( డీజిల్)- రూ. 1.56 లక్షలు
*థార్ 2WD (డీజిల్)- రూ. 1.35 లక్షలు
*థార్ 4WD (డీజిల్)- రూ. 1.01 లక్షలు
*స్కార్పియో క్లాసిక్- రూ. 1.01 లక్షలు
*స్కార్పియో ఎన్- రూ. 1.45 లక్షలు.
*థార్ రాక్స్- రూ. 1.43 లక్షలు

Exit mobile version