Mahindra cars: ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి రాబోతోంది. దీని ఫలితంగా, కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లక్షల్లో డబ్బు ఆదా కాబోతోంది. పెట్రోల్ కోసం 1,200cc మరియు డీజిల్ కోసం 1,500cc మించని ఇంజిన్ సామర్థ్యం కలిగిన 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్‌లను చిన్న కార్లుగా చెబుతారు.