Site icon NTV Telugu

Maharashtra: అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించిన యూబీటీ ఎమ్మెల్యేలు

Shiv Sena

Shiv Sena

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించారు. వారి నిర్ణయం ప్రస్తుతం పొలిటికల్ సర్కార్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని యూబీటీ ఎమ్మెల్యే ఆధిత్య థాక్రే తెలిపారు. మా పార్టీ (యూబీటీ) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా కనిపించడం లేదు.. ఈవీఎంల విషయంలోనూ ఏదో తప్పు జరిగిందని ఆదిత్య ఠాక్రే వెల్లడించారు.

Read Also: Bihar: బీహార్‌లో ఆందోళనకు దిగిన పోటీ పరీక్షల అభ్యర్థులు.. పోలీసుల లాఠీఛార్జ్!

ఇక, ఈ తీర్పును ప్రజలిచ్చినట్లు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు అని ఆదిత్య ఠాక్రే అన్నారు. అలా జరగలేదు కాబట్టే మహారాష్ట్రలో ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదన్నారు. ఇక, మరోవైపు.. థాక్రే వ్యాఖ్యలపై మహాయుతి కూటమి నేతలు కౌంటర్ ఎటాక్ కు దిగారు. విపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. అవసరమైతే కోర్టును, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సలహాలు ఇచ్చారు. అయితే, ఈరోజు (డిసెంబర్ 7) మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్‌, ఏక్ నాథ్ షిండే, అజిత్‌ పవార్‌తో సహా పలువురు ప్రమాణస్వీకారం చేశారు.

Exit mobile version