NTV Telugu Site icon

Maharashtra: చంటి బిడ్డతో బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యే..

Saroj Ahire

Saroj Ahire

MLA Saroj Ahire: మహారాష్ట్ర మహిళా ఎమ్మెల్యే చంటి బిడ్డతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే సరోజ్ అహిరే తన నాలుగు నెలల బిడ్డతో ముంబైలోని మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం నుంచి మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజే తన కుమారుడితో అసెంబ్లీకి హాజరై ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు సరోజ్ అహిరే. గతేడాది డిసెంబర్ లో నాగ్‌పూర్‌లో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో కూడా ఇలాగే తన చంటి పిల్లాడితో సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమయంలో బిడ్డను ఎత్తుకుని ఉన్న ఎమ్మెల్యే ఫోటోలు వైరల్ అయ్యాయి.

Read Also: chai-chapati: చాయ్ చపాతీ కాంబినేషన్ హిట్.. తిన్నారంటే మీరు ఫట్

మహారాష్ట్ర విధాన్ భవన్ లో హిర్కాని యూనిట్ ఉందని, దీనిని మహిళలు తమ పిల్లలకు ఆహారం ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చని.. ఈ సదుపాయం పనిచేసే మహిళలందరికీ ఉందని విధాన్ భవన్ అధికారి చెప్పారు. అయితే విధాన్ భవన్ లోని హిర్కానీ యూనిట్ దుమ్ము ధూళితో నిండి ఉందని ఎమ్మెల్యే సరోజ్ అహిరే ఫిర్యాదు చేశారు. అధికారులు గదిని శుభ్రం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు. ఇదిలా ఉండగా..గతేడాది డిసెంబర్ లో కారు ప్రమాదంలో గాయపడిన బీజేపీ ఎమ్యెల్యే జయకుమార్ గోరే వాకర్ ను ఉపయోగించి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందు వచ్చారు.

ఎమ్మెల్యే సరోజ్ అహిరే నాసిక్‌లోని డియోలాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గానికి నిధులను షిండే-ఫడ్నవీస్ సర్కార్ ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. తన పిల్లాడికిథ జ్వరంగా ఉండటంతో విడిచిపెట్ట లేక, బిడ్డతోనే బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యానని వెల్లడించారు. తన నియోజకవర్గ సమస్యలను వినిపించేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు.