Maharashtra: చంటి బిడ్డతో బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Saroj Ahire: మహారాష్ట్ర మహిళా ఎమ్మెల్యే చంటి బిడ్డతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే సరోజ్ అహిరే తన నాలుగు నెలల బిడ్డతో ముంబైలోని మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం నుంచి మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజే తన కుమారుడితో అసెంబ్లీకి హాజరై ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు సరోజ్ అహిరే. గతేడాది డిసెంబర్ లో నాగ్‌పూర్‌లో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో కూడా ఇలాగే తన చంటి పిల్లాడితో సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమయంలో బిడ్డను ఎత్తుకుని ఉన్న ఎమ్మెల్యే ఫోటోలు వైరల్ అయ్యాయి.
Read Also: chai-chapati: చాయ్ చపాతీ కాంబినేషన్ హిట్.. తిన్నారంటే మీరు ఫట్
Also Read
మహారాష్ట్ర విధాన్ భవన్ లో హిర్కాని యూనిట్ ఉందని, దీనిని మహిళలు తమ పిల్లలకు ఆహారం ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చని.. ఈ సదుపాయం పనిచేసే మహిళలందరికీ ఉందని విధాన్ భవన్ అధికారి చెప్పారు. అయితే విధాన్ భవన్ లోని హిర్కానీ యూనిట్ దుమ్ము ధూళితో నిండి ఉందని ఎమ్మెల్యే సరోజ్ అహిరే ఫిర్యాదు చేశారు. అధికారులు గదిని శుభ్రం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు. ఇదిలా ఉండగా..గతేడాది డిసెంబర్ లో కారు ప్రమాదంలో గాయపడిన బీజేపీ ఎమ్యెల్యే జయకుమార్ గోరే వాకర్ ను ఉపయోగించి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందు వచ్చారు.
ఎమ్మెల్యే సరోజ్ అహిరే నాసిక్‌లోని డియోలాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గానికి నిధులను షిండే-ఫడ్నవీస్ సర్కార్ ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. తన పిల్లాడికిథ జ్వరంగా ఉండటంతో విడిచిపెట్ట లేక, బిడ్డతోనే బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యానని వెల్లడించారు. తన నియోజకవర్గ సమస్యలను వినిపించేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు.
- Tags
- bjp
- Maharashtra
- MLA Saroj Ahire
- NCP
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!