దోషిగా తేలిన మంత్రి.. 2 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే తప్పు ఓ మంత్రికి రెండు నెలల జైలు శిక్ష విధించేలా చేసింది.. జైలు శిక్షతో పాటు జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర మంత్రి బచ్చు కడూకి అమ్రావతి కోర్టు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. దాని కారణంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను దాచడం.. ఈ కేసులో ఆయన దోషిగా తేలడమే.. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బచ్చు కడూ.. అచల్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన మంత్రి పదవి కూడా చేపట్టారు..
Read Also: IND vs WI: టీ20 సిరీస్‌కు ఆ ఇద్దరు దూరం..
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
అయితే, పోటీ చేసిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ముంబైలో తనకు ఉన్న ఫ్లాట్ వివరాలను నమోదు చేయలేదు.. దీనిపై బీజేపీ కౌన్సిలర్ గోపాల్ తిరమరే కోర్టును ఆశ్రయించారు.. ఇక, ఎప్పటి నుంచో విచారణ జరుగుతుండగా.. ఇవాళ విచారణ ముగిచింది కోర్టు.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పాఠశాల విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్న బచ్చు కడూను దోషిగా తేలుస్తూ.. రెండు నెలల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. అయితే, దీనిపై పై కోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, బెయిల్ మంజూరు చేయాలంటూ బచ్చు కడూ పిటిషన్ దాఖలు చేయగా.. సానుకూలంగా స్పందించిన కోర్టు.. పై కోర్టులో అప్పీల్‌కు నెల రోజు సమయం ఇవ్వడంతో పాటు బెయిల్ మంజూరు చేసింది..
తాజావార్తలు
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..!
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..