కరోనా మహమ్మారి దేశాన్ని ఎంతగా వణికిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వలన మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే మహమ్మారి నుంచి బయటపడుతున్నది. కరోనాను తరిమి కోట్టడంలో గ్రామాలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. చాలా గ్రామాలు స్వయంగా లాక్‌డౌన్, స్వీయనియంత్రణ వంటివి ప్రకటించుకొని బయటపడుతున్నాయి. కరోనాను తరిమికొట్టడంలో గ్రామాలు చురుకైన పాత్రను పోషిస్తుండటంతో ప్రభుత్వం ఆసక్తికరమైన పోటీని తీసుకొచ్చింది. కరోనాను తరిమికొట్టి కరోనా ఫ్రీ విలేజ్ గా నిలిచిన గ్రామాలకు ప్రభుత్వం రూ.50 లక్షల రూపాయల బహుమానం ప్రకటించనుందని మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పేర్కొన్నారు. త్వరలోనే తప్పకుండా మహారాష్ట్ర నుంచి కరోనాను తరిమికొడతామని మంత్రి ప్రకటించారు.