Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం
- అంబరాన్నంటిన సంబరాలు
- మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత సమాజంలో మగపిల్లాడిపై ఉండే మక్కువ ఆడపిల్లలపై ఉండడం లేదు. ఆడబిడ్డ అని టెస్ట్‌ల్లో తేలితే చాలా మంది గర్భాన్ని తొలగించేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక కుటుంబం అలాంటి మనస్తత్వాన్ని పక్కన పెట్టి కొత్త ఆదర్శాన్ని నెలకొల్పారు. దాదాపు నాలుగు తరాల తర్వాత.. అనగా 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఆస్పత్రి నుంచి ఇంటికి సంబరాలతో తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Also Read
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దహిఫాలే కుటుంబంలో దాదాపు రెండు శతాబ్దాల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఐదో తరంలో కుమార్తె పుట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషం ఉప్పొంగిపోయారు. పాపను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చే సమయంలో రథంలో ఊరేగింపు నిర్వహించారు. డప్పులు, వాయిద్యాల మధ్య బంధువులు, కుటుంబ సభ్యులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఇక పాపకు ‘గార్గి’ అని నామకరణం చేశారు. ఆడబిడ్డ జన్మించగానే కుటుంబమంతా ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించినట్లుగా అమ్మమ్మ సురేఖ దహిఫాలే తెలిపింది. చాలా మంది అబ్బాయి పుడతాడని ఆశిస్తారని.. కానీ అమ్మాయి పుట్టినప్పుడు కలిగే ఆనందం వేరు అని గార్గి తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. అమ్మాయిలు తండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారన్నారు. అందుకే తాను ఎప్పుడూ అమ్మాయినే కోరుకున్నట్లు చెప్పారు.
‘ఇది మా అదృష్టం’..
గార్గి తాత లింబాజీ దహిఫలే చిన్నారిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘కుటుంబంలో ఆడపిల్ల ఉండటం ఎంతో అదృష్టం. ఇన్నేళ్లుగా మా కుటుంబంలో ఆడపిల్ల లేదనే బాధ ఉండేది. ఇప్పుడు ఆ లోటు తీరింది’’ అని ఆయన అన్నారు. తన ఇద్దరు కోడళ్లను కూడా సొంత కుమార్తెల్లాగే చూసుకున్నానని లింబాజీ తెలిపారు. ఇప్పుడు తన మనవరాలిని రథంలో సంగీతం, నృత్యాల మధ్య ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. గార్గి నాయనమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ.. చిన్నారి జన్మించిన విషయం తెలిసిన వెంటనే ఆమెను ఎంతో ఘనంగా ఇంటికి తీసుకురావాలని ఆస్పత్రిలోనే నిర్ణయించుకున్నామని తెలిపారు. ‘‘ఈ రోజు మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం’’ అని ఆమె అన్నారు.
సానుకూల సందేశం ఇచ్చిన కుటుంబం
ఆడపిల్లల జననంపై ఇప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల్లో సంకుచిత ఆలోచనలు ఉన్నాయని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దహిఫలే కుటుంబం గార్గి జననాన్ని ఘనంగా వేడుకగా నిర్వహించడం ద్వారా సమాజానికి సానుకూల సందేశం ఇచ్చిందని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!