శీతాకాలంలో మహారాష్ట్ర ఎన్నికలు హీటు పెంచుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓ వైపు నామినేషన్లు.. ఇంకో వైపు ప్రచారాలు దూకుడుగా సాగిపోతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో పెద్ద పెద్ద ధనవంతులే పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల అఫిడవిట్ ప్రకారం బీజేపీకి చెందిన మలబార్ హిల్ అభ్యర్థి మంగళ్ ప్రభాత్ లోధాకు రూ.447 కోట్లు ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈయన అత్యంత సంపన్న అభ్యర్థిగా మొదటి స్థానంలో నిలిచారు. 2019లో రూ.441 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.447 కోట్లకు చేరింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: అభిమాన నేతకు పేద విద్యార్ధిని తీపి జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం
మంగళ్ ప్రభాత్ లోధా అఫిడవిట్ ప్రకారం… 2019లో రూ. 441.65 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ. 447 కోట్ల ఆస్తికి చేరింది. అతనికి రూ. 218 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 228 కోట్ల చరాస్తులు ఉన్నాయి. లోధా 1980లో ముంబైలో డెవలపర్ లోధా గ్రూప్‌ను స్థాపించారు. దీనిని ఇప్పుడు మాక్రోటెక్ డెవలపర్స్ అని పిలుస్తారు. వాస్తవానికి రాజస్థాన్‌కు చెందిన లోధా… ఫోర్బ్స్ ప్రకారం ముంబైలోని సుదూర శివారు ప్రాంతాల్లో మధ్యతరగతి గృహాలను నిర్మించి లాభాలు అర్జించారు. ఇక రెండు స్థానంలో ప్రతాప్ సర్నాయక్ (శివసేన) రూ. 333.32 కోట్లు (ఓవాలా మజివాడ సీటు)తో ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మరియు కోలాబా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అయిన రాహుల్ నార్వేకర్ మొత్తం రూ. 129.80 కోట్ల ఆస్తితో మూడవ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఆరోసారి పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధనవంతుల జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. ఫడ్నవీస్ తన ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు రూ. 5.2 కోట్ల నికర ఆస్తులను ప్రకటించారు. మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్ 20న జరుగుతుండగా.. 23న ఫలితాలు వెలువడనున్నాయి.
ధనవంతుల అభ్యర్థుల జాబితా ఇదే
1. మలబార్ హిల్ అభ్యర్థి మంగళ్ ప్రభాత్ లోధాకు రూ.447 కోట్లు
2. ప్రతాప్ సర్నాయక్ (శివసేన): రూ. 333.32 కోట్లు (ఓవాలా మజివాడ సీటు)
3. రాహుల్ నార్వేకర్ (బీజేపీ): రూ. 129.80 కోట్లు (కొలాబా సీటు)
4. సుభాష్ భోయిర్ (శివసేన-యుబిటి): రూ. 95.51 కోట్లు (కళ్యాణ్ రూరల్ సీటు)
5. జితేంద్ర అవద్ (ఎన్‌సీపీ-ఎస్పీ): రూ. 83.14 కోట్లు (ముంబ్రా-కల్వా సీటు)
6. నజీబ్ ముల్లా (ఎన్‌సీపీ): రూ. 76.87 కోట్లు (ముంబ్రా-కాల్వా స్థానం)
7. దేవేంద్ర ఫడ్నవీస్ : రూ 13.27 కోట్లు (నాగ్‌పూర్ సౌత్ వెస్ట్)
8. ఆశిష్ షెలార్ (బీజేపీ మహా చీఫ్): రూ. 40.47 కోట్లు (బాంద్రా వెస్ట్)
9. రాజు పాటిల్ (ఎంఎన్‌ఎస్): రూ 24.79 కోట్లు (కళ్యాణ్ రూరల్)
10. ఆదిత్య థాకరే (శివసేన-యుబిటి): రూ. 23.43 కోట్లు (వర్లీ)