కేంద్ర కేబినెట్ విస్తరణపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. చివరకు ముహూర్తం పెట్టేశారు.. రేపు సాయంత్రం కొత్త కేబినెట్ కొలువు తీరనుంది.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దూరమైన బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటి కానున్నాయనే ప్రచారం ఊపందుకుంది… అందులో భాగంగా శివసేన కేంద్ర కేబినెట్‌లోనూ చేరుతుందనే గుసగుసలు వినిపించాయి.. అయితే, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే.. కేంద్ర మంత్రివర్గంలో చేరే అంశం పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసిన ఆయన.. బీజేపీతో శివసేన తిరిగి సఖ్యతపై వస్తున్న వార్తలను ఖండించారు.. నేనెక్కడికే వెళ్లడం లేదని స్పష్టం చేశారు.. కాగా, ఢిల్లీ పర్యటనకు వెళ్లి సీఎం ఉద్ధవ్ థాకరే.. ప్రధాని నరేంద్ర మోడీని భేటీ అయిన తర్వాత.. ఇక, మళ్లీ శివసేన-బీజేపీ దోస్తీ చేస్తాయనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
కేంద్ర కేబినెట్‌లోకి శివసేన..? క్లారిటీ ఇచ్చిన ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray