Site icon NTV Telugu

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్‌..

Cm Uddhav Thackeray

Cm Uddhav Thackeray

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరోసారి హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో శివసేన పార్టీ ఉన్నట్టు స్పష్టం అవుతోంది.. విధాన సభను రద్దు చేయొచ్చంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేయడం చర్చగా మారింది.. ఇప్పటికే ట్విట్టర్‌లో మంత్రి హోదాను ఆదిత్య థాక్రే తొలగించుకోవడం ఆస్తికరంగా మారాయి.. శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహా రాజకీయాల్లో హీట్‌ పెరగగా.. శివసేకు ఉన్న మొత్తం 55మంది ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్‌ షిండే వెంటే 34మంది ఎమ్మెల్యేలు వెళ్లడంతో.. ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామంతో సీఎం ఉద్ధవ్‌ థాక్రే వైపు మిగిలింది కేవలం 21 మందే కావడంతో.. ఎప్పుడైనా సర్కార్‌ కూలిపోవచ్చు అంటున్నారు.

Read Also: Green India Challenge: కొత్త చరిత్ర సృష్టించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రాజకీయ సంక్షోభంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఐసోలేషన్‌లో ఉన్నట్టుగా పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్‌ చర్చగా మారింది.. సీఎం ఉద్ధవ్‌ థాక్రే, గవర్నర్‌కు కూడా కరోనా సోకింది.. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఐసోలేషన్‌కే పరిమితం కావడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది.. ఇక, గవర్నర్‌ కూడా కరోనా బారినపడడంతో.. గోవా గవర్నర్‌కు మహారాష్ట్ర ఇంఛార్జ్‌ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు.. మరోవైపు.. ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అర్థంకానీ పరిస్థితి ఉంది.. శివసేన, ఉద్ధవ్ థాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా, సంప్రదింపులు జరిపినా ఏక్‌నాథ్ షిండే దిగిరాకపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. అయితే, భారతీయ జనతా పార్టీతో కలిసేప్రసక్తే లేదని ఇప్పటికే థాక్రే స్పష్టం చేశారు.. రాజీకంటే.. అసెంబ్లీని రద్దు చేయడమే బెటర్‌ అని వ్యాఖ్యానించారు. దీంతో, ప్రభుత్వాన్ని రద్దుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version