Maharashtra: పొదుపు మంత్రం.. బైక్‌పై విధాన్ భవన్‌కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- నాయకులు పొదుపు మంత్రం
- బైక్‌పై విధాన్ భవన్‌కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- కాలినడకన సచివాలయానికి వెళ్లిన నితేష్ రాణే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు పొదుపు మంత్రం నేర్పిస్తోంది. నిన్నామొన్నటి దాకా హంగు, ఆర్భాటాలతో మెలిగిన నాయకులంతా ఇప్పుడు మధ్యప్రాచ్యం యుద్ధ పుణ్యమా అంటూ పొదుపు మంత్రం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపుపై జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ కాన్వాయ్ సగానికి సగం తగ్గిపోయింది. కేంద్రమంత్రులు కూడా బస్సులు, మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్తున్నారు.

Also Read
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏకంగా బైక్‌పై ముంబైలోని విధాన్ భవన్‌కు వెళ్లారు. అందరికీ భిన్నంగా వినూత్నంగా ప్రయత్నించారు. కొత్త శాసన మండలి సభ్యుల ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఫడ్నవిస్ తన అధికారి నివాసం నుంచి మంత్రి శిష్ షెలార్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రయాణించారు.
ఇదే తరహాలో రాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు కాలినడకనే సచివాలయానికి చేరుకున్నారు. బుధవారం సీఎం ఫడ్నవీస్ పలు పొదుపు చర్యలను ప్రకటించారు. మంత్రుల కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించడం, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను రద్దు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతున్నందున ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోడీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. జిల్లాల పర్యటనల సమయంలో మంత్రుల కాన్వాయ్‌లలో నిర్ణయించిన పరిమితికి మించి వాహనాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుపై సంబంధిత పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు బాధ్యత వహించనున్నారు. అలాగే వివిధ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాల వినియోగంపై కూడా కఠిన సమీక్ష చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
On Hon PM @narendramodi Ji’s appeal, here’s my bit towards austerity measures for our Nation 🇮🇳
I appeal everyone to please bring lifestyle changes in every possible way. pic.twitter.com/SbsREExpcr— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 14, 2026
#WATCH | Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis reaches Vidhan Bhavan on a bike for the MLC oath-taking ceremony after PM Narendra Modi’s appeal to reduce fuel Consumption. pic.twitter.com/zHXbxvKpwD
— ANI (@ANI) May 14, 2026
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి