Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- సంతానలేమిపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- పిల్లలను కనకపోతే క్రూరత్వమా?
- బాధితుడి పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంతానలేమిపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంతానం లేకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం దంపతులు కాలేదన్న కారణంతో భార్యను దోషిగా పేర్కొనలేమని తెలిపింది. జస్టిస్‌లు జి.ఆర్. స్వామినాథన్, ఎం.డి. సుమతిలతో కూడిన ధర్మాసనం… భార్యకు సంతానం కలగకపోవడాన్ని ‘వైవాహిక దోషం’గా పరిగణించలేమని తీర్పు ఇచ్చింది. భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.
భార్య క్రూరత్వం కారణంగా సంతానం కలగలేదని.. తనకు విడాకులు ఇవ్వాలంటూ ఓ భర్త పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. అనంతరం బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం హైకోర్టు కూడా పిటిషన్‌ను కొట్టేసింది. వివాహం యొక్క ఉద్దేశం పిల్లలను కనడం మాత్రమే కాదని.. సంతానం లేనంతమాత్రాన వైవాహిక సంబంధంలో ఏ భాగస్వామి విఫలమైనట్లు కాదని కోర్టు పేర్కొంది.
Also Read
- International Men's Day: "నువ్వు మగాడివి.. ఏడవకూడదు".. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
- PM Modi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
- Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
అసలు విషయం ఏమిటి?
బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం.. ఆ దంపతులు జూన్ 2007లో వివాహం చేసుకున్నారు. మొదట్లో వివాహ జీవితం సజావుగా సాగినప్పటికీ… ఆ తర్వాత భార్య తనను అవమానించడం, పని నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు అనుమానించడం, తరచుగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించిందని భర్త ఆరోపించాడు. 2016 జూన్‌లో తన భార్య బహిరంగంగా తనను నపుంసకుడని పిలిచిందని.. చెప్పుతో, ఆ తర్వాత చీపురుతో కొట్టిందని, మంగళసూత్రాన్ని తీసివేసిందని, ఫొటోలను చించివేసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆరోపించాడు. అయితే భర్త ఆరోపణలను భార్య ఖండించింది. తాను గర్భాశయ ఫైబ్రాయిడ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నానని, అలాగే బిడ్డను కని తన వైవాహిక జీవితాన్ని కొనసాగించాలనే ఆశతో చికిత్స కూడా తీసుకున్నానని తెలిపింది.
శారీరక, మానసిక ఇబ్బందులు తెలిసినప్పటికీ, బిడ్డను కనాలని, వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలని ఆశతో భార్య సంతోషంగా అటువంటి చికిత్సను భరిస్తే, ఆమె ప్రవర్తనను ఏ విధంగానూ వివాహాన్ని తిరస్కరించినట్లుగా గానీ, భర్త పట్ల క్రూరత్వంగా గానీ పరిగణించలేమని కోర్టు పేర్కొంది. భర్తతో కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనే ఆశతో పదేపదే బాధాకరమైన చికిత్స చేయించుకునే స్త్రీ, వైవాహిక బంధాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా పరిగణించబడదని తెలిపింది. పిల్లలు లేకపోవడం వల్ల భార్యాభర్తలిద్దరూ మానసిక వేదనకు గురైనప్పటికీ, సంతానలేమి చికిత్స వల్ల కలిగే శారీరక పరిణామాలను భరించాల్సింది మహిళేనని కూడా కోర్టు పేర్కొంది. దంపతులు చాలా కాలం పాటు విడివిడిగా ఉండటం క్రూరత్వాన్ని లేదా వివాహం పూర్తిగా విచ్ఛిన్నమవ్వడాన్ని నిరూపించడానికి సరిపోతుందనే వాదనను కూడా కోర్టు తిరస్కరించింది.
తాజావార్తలు
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
-
Mohamed Siraj Dropped: సిరాజ్‌ను అందుకే పక్కన పెట్టాం?.. అసలు విషయం చెప్పిన కెప్టెన్ గిల్!
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
-
Gold and Silver Prices: కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మరోసారి భారీగా బంగారం, వెండి ధరల పతనం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..