Tamil Nadu: ఆ డబ్బు దేవుళ్ళది.. ఆలయ నిధులను ప్రభుత్వం వాడుకోవద్దు: మద్రాస్ హైకోర్టు
- ఆలయ నిధులతో కళ్యాణ మండపాలు కట్టాలని తమిళనాడు సర్కార్ ఆదేశాలు..
- తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన మద్రాస్ హైకోర్టు..
- ఆ డబ్బు దేవుళ్ళకు చెందుతుంది.. ఆలయ నిధులను ప్రభుత్వం వాడుకోవద్దు: న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: ఆలయ నిధులను ఉపయోగించి కళ్యాణ మండపాలను నిర్మించడానికి అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కొట్టివేసింది. ఆ నిధులను ప్రభుత్వం ఉపయోగించడానికి అవకాశం లేదని తేల్చి చెప్పింది. భక్తులు సమర్పించిన హుండీ నిధులు, దాతలు ఇచ్చిన ఆస్తులు అన్నీ దేవుడికే చెందుతాయి, దేవుడే వాటి యజమాని అని జస్టిస్ ఎస్ఎం. సుబ్రమణ్యం, జస్టిస్ జీ. అరుళ్ మురుగన్ లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇక, దేవాలయాలు లాభాపేక్షలేని సంస్థలు కాబట్టి, వాటి నిధులను హిందూ మత, దాతవ్య చట్టం (HR & CE Act)లో పేర్కొన్న పరిమితుల మేరకే వినియోగించాలంటూ తీర్పునె వెలువరించింది.
Also Read
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
అయితే, ఈ చట్టం ప్రభుత్వానికి హిందూ మత సంస్థలను పర్యవేక్షించే అధికారం ఇచ్చినప్పటికీ.. భక్తులు లేదా దాతలు అందజేసిన నిధులు, ఆస్తులను ఆలయ ఉత్సవాలు, దేవాలయాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని సూచించింది. అంతేగాని, మతేతర కార్యకలాపాలకు ఉపయోగించరాదు.. ఒకవేళా అలా చేస్తే, హిందువుల మత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా, HR & CE మంత్రి పీకే శేఖర్ బాబు అసెంబ్లీలో 27 దేవాలయాల్లో రూ.80 కోట్ల వ్యయంతో పెళ్లి మండపాలు నిర్మించనున్నట్లు ప్రకటించిన విషయాన్ని కూడా మద్రాస్ హైకోర్టు ప్రస్తావించింది. ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకుని, ఈ నిధుల మళ్లింపును నిలిపివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది.
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!