Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
- మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారిన ప్రేమ పెళ్లి..
- మాజీ ఖైదీని వివాహం చేసుకున్న మహిళా జైలర్..
- జైలులోనే ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Marraige: ప్రేమ గుడ్డిది, కులం, మతం , ప్రాంతం అనే భేదాలు లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా కలిగొచ్చు. పేద, ధనిక తేడాలను చూడదు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటనను చూస్తే ఇదంతా నిజం అనిపిస్తుంది. సత్నా జైలులో జరిగిన సంఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మహిళా అధికారి, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీని వివాహం చేసుకుంది. ఈ జైలర్, ఖైదీ ప్రేమ కథ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?
Also Read
- Bengaluru: నీట్ రీ ఎగ్జామ్‌కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
- West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
- Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయిన ఫిరోజా ఖతూన్, వారెంట్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నప్పుడు ధర్మేంద్ర సింగ్ అనే ఖైదీని కలిశారు. ఛతర్‌పూర్ జిల్లాలోని చాండ్లా నివాసి అయిన ధర్మేంద్ర సింగ్, 2007లో ఒక కౌన్సిలర్‌ను హత్య చేసి, పూడ్చిపెట్టిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో ధర్మేంద్ర వారెంట్ సంబంధిత పనుల్ని ఫిరోజా చూసే వారు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత, సత్ర్పవర్తన కారణంగా ధర్మేంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. ధర్మేంద్ర నాలుగేళ్ల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. మే 5న ఛతర్‌పూర్ జిల్లాలోని లవ్‌కష్ నగర్‌లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఫిరోజా ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది. ఆమె కుటుంబం ఈ పెళ్లి పట్ల అసంతృప్తితో ఉండటంతో, ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. సత్నాలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్ బహదూర్ మిశ్రా తన భార్యతో కలిసి ఫిరోజాకు కన్యాదానం చేశారు. ఈ పెళ్లికి బజరంగ్ దళ్ సభ్యులు కూడా హాజరయ్యారు. సత్నా జైలు అధికారులు, సిబ్బంది, ఖైదీలు కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్‌కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!