Assam: అస్సాంలో పంచాయతీ ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ‘‘లుంగీ vs గాడ్సే రివాల్వర్’’ పంచాయతీ నడుస్తోంది. కాంగ్రెస్ ధోతీలను పంపిణీ చేయడాన్ని అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన గుర్తుకు బదులుగా, లుంగీని ఎంచుకోవాలని అన్నారు. అయితే, దీనికి కాంగ్రెస్ స్పందిస్తూ.. బీజేపీ ‘‘గాడ్సే రివాల్వర్’’ని ఎంచుకోవాలని సూచించింది. నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేయడాన్ని ఇది సూచిస్తుంది.
Read Also: India Bangladesh: బంగ్లాదేశ్‌లో కీలక రైలు ప్రాజెక్ట్ నిలిపేసిన భారత్..
2001-2016 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అస్సాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని హిమంత ఆరోపించారు. సోమవారం ధేమాజీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పాలనను ఎండగట్టారు. కాంగ్రెస్ పరిపాలనలో లుంగీ, ధోతీ మాత్రమే ఉన్నాయని, కాంగ్రెస్ తన గుర్తుని చేతికి బదులుగా లుంగీగా మార్చుకోవాలని అని అననారు. ఈ ప్రాంతంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలు ‘‘లుంగీలను’’ ఎక్కువగా ఉపయోగిస్తారు.
బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ భూపేన్ కుమార్ బోరా స్పందించారు. కాంగ్రెస్ లుంగీ, ధోలీ, పైజామా, ప్యాంట్ అన్ని దుస్తుల్ని సమానంగా పరిగణిస్తుందని అన్నారు. కాంగ్రెస్ దృక్పథం అందర్ని కలుపుకుపోవడమే అని, బీజేపీ తన గుర్తు ‘‘కమలానికి’’ బదులుగా నాథురామ్ గాడ్సే గాంధీని హత్య చేయడానికి ఉపయోగించిన తుపాకీతో భర్తీ చేయాలని అన్నారు. అస్సాంలో పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో మే 2, మే 7న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మే 11న ఉండనుంది.
