లక్నోలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కానీ ఇక్కడ ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దొంగలు వెనుక కిటికీ గ్రిల్‌ను కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించి 50వేల నగదు, వెండి నాణేలతో పాటు బాత్రూమ్ సింక్‌ను కూడా ఎత్తుకెళ్లారు.
నోయిడాలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి యమునా ప్రసాద్ ఇళ్లు లక్నోలోని వికాస్ నగర్ లో ఉంది. సెప్టెంబర్ 22 సాయంత్రం దొంగలు వెనుక కిటికీ గ్రిల్‌ను కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించారు. 50వేల నగదు, వెండి నాణేలను ఎత్తుకెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్న చివరకు బాత్రూమ్ లో ఉన్న సింక్ ను కూడా ఎత్తుకెళ్లారు. పాటు బాత్రూమ్ సింక్‌ను కూడా ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనాత్మకంగా మారింది..
సెప్టెంబర్ 23న దొంగతనం గుర్తించారు బాధితులు. ఇంట్లో నుండి ₹50,000 నగదు, వెండి నాణేలు మరియు ఇతర విలువైన వస్తువులు పోయాయని పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు..