NTV Telugu Site icon

Shiromani Akali Dal: “డ్రగ్స్ నేరస్తులకు ఉరిశిక్ష, పంజాబ్ ద్వారా పాకిస్తాన్‌తో వ్యాపారం”.. ఎస్ఏడీ మానిఫెస్టో..

Sad

Sad

Shiromani Akali Dal: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో శిరోమణి అకాళీదళ్ కీలక హామీలను ఇచ్చింది. పంజాబ్ జలంధర్‌లో ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విడుదల చేశారు. జూన్ 1న పంజాబ్‌లోని అన్ని స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తమ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తే మాదక ద్రవ్యాల కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలని పిలుపునిచ్చాడు. సిక్కు ఖైదీల విడుదల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా చెక్‌పోస్ట్, ఫిరోజ్‌పూర్‌లోని హుస్సేనివాలా మరియు ఫజిల్కా ద్వారా భారతదేశం-పాకిస్తాన్ వాణిజ్య కారిడార్‌ను తిరిగి తెరవడానికి కృషి చేస్తామని వెల్లడించారు.

Read Also: Pune horror: భర్త అమానుషం.. భార్య శీలాన్ని శంకించి ఏం చేశాడంటే..!

గుజరాత్ ఓడరేవుల ద్వారా పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని కేంద్రం అనుమతించగలిగితే, పంజాబ్‌లో వాణిజ్యాన్ని పెంచడానికి రహదారి నెట్‌వర్క్ ద్వారా అదే ఎందుకు చేయలేము.? అని ప్రశ్నించారు. తాము ఎన్నికైతే పొరుగు దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పునరుద్ధరించేలా డిమాండ్ చేస్తామని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. డ్రగ్స్ వ్యాపారం, దాని వెనక ఉన్నవారినపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తామని సుఖ్‌బీర్ చెప్పారు. సిక్కు ఖైదీల (బందీ సింగ్‌లు) విడుదల కోసం కేంద్రంతో పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని SAD అధ్యక్షుడు చెప్పారు. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) రద్దుకు వ్యతిరేకంగా బలమైన స్వరాన్ని వినిపిస్తామని అన్నారు. ఈడీ, సీబీఐ వంటి జాతీయ ఏజెన్సీలు తనిఖీలు, బ్యాలెన్స్ వ్యవస్థని ప్రతిపాదిస్తామని, రాజకీయ దుర్వినియోగం కాకుండా నిరోధిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ విభజన రాజకీయాలు చేసి, మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని అకాళీదళ్ ఆరోపించింది. పంజాబ్‌లో 13 ఎంపీ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.

ఎస్ఏడీ హామీలు:

పంజాబ్ స్వతంత్ర రాజధానిగా చండీగఢ్ కోసం పోరాటం, అన్ని సిక్కు మత సంస్థల్ని ఇతర ఆర్గనైషన్ల నుంచి SGPC పరిధిలోకి తీసుకురావడం, రైతులకు ఎంఎస్‌పీ, పంజాబీయేతరులు వ్యవసాయం కోసం పంజాబ్‌లో భూమిని కొనుగోలు చేయకుండా నిరోధించడం, పంజాబీలు రాజస్తాన్, హర్యానాలలో వ్యవసాయ భూమని కొనుగోలు చేయడానిక అనుమతించడం, పంజాబ్‌లో పంజాబీలు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందేలా చట్టం తీసుకురావడం, అమృత్‌సర్‌ను టెక్స్‌టైల్ మరియు టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడం.