Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Lpg Shortage Hcltech Offers Work From Home As Office Cafeterias Disrupted

Work From Home: వంట గ్యాస్ ఎఫెక్ట్.. ఉద్యోగస్థులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేసిన టాప్ టెక్ దిగ్గజం..

Published Date :March 12, 2026 , 4:12 pm
By Burugadda Veerababu
  • వంట గ్యాస్ కష్టాలు ఐటీ ఉద్యోగులకు కూడా..
  • క్యాంటీన్ మూసేయడంతో వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ చేసిన టెక్ కంపెనీ..
  • ఇన్పోసిస్‌లో కూడా ఇదే పరిస్థితి..
Work From Home: వంట గ్యాస్ ఎఫెక్ట్.. ఉద్యోగస్థులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేసిన టాప్ టెక్ దిగ్గజం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వంట గ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు ఐటీ కంపెనీలపై కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ సంస్థ HCLTech చెన్నై కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మార్చి 12, 13 తేదీలలో వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థలోని ఇద్దరు సీనియర్ అధికారులు వెల్లడించారు. చెన్నై కార్యాలయంలోని క్యాంటీన్లలో పనిచేసే వారు వంట గ్యాస్ కొరత కారణంగా సేవలు అందించలేకపోతున్నారు. దీంతో ఉద్యోగులకు ఆహార సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని కంపెనీ అనుమతించింది.

ప్రభుత్వం భరోసా ఇచ్చినా కూడా వంట గ్యాస్ కొరత కొనసాగుతుండటంతో దేశంలోని అనేక రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై చేపట్టిన చర్యల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. దాని ప్రభావం భారత కంపెనీలపైనా క్రమంగా కనిపిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 పెంచగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.144 పెంచారు. దీంతో హోటళ్లు, క్యాంటీన్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఈ అంశంపై అధికారికంగా స్పందించాలంటూ HCLTech సంస్థకు ఈమెయిల్ పంపినప్పటికీ ఇంకా సమాధానం రాలేదని సమాచారం.

Also Read

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
  • Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
  • PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
  • Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
Add as a preferred
source on google

Also Read:Half Day Schools: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..

ఇదిలా ఉండగా.. మరో ఐటీ దిగ్గజం Infosys కూడా తమ ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లోని క్యాంటీన్లలో సాధారణంగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించనున్నట్లు తెలిపింది. కమర్షియల్ వంట గ్యాస్ అందుబాటుపై అనిశ్చితి ఉన్నందున కొన్ని ఫుడ్ కౌంటర్లను తాత్కాలికంగా మూసివేసింది. ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుంచి ఆహారం తీసుకురావాలని సూచించింది. గత ఏడాది చివరి నాటికి Infosys సంస్థలో సుమారు 3.37 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. HCLTech సంస్థలో 2.26 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు.

Also Read:Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?

మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంతో వ్యాపార సంబంధాలు ఉన్న కంపెనీలు కొత్త సీనియర్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయని గ్లోబల్ రిక్రూట్‌మెంట్ సంస్థలు చెబుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన ఈ ఘర్షణలో ఆ ప్రాంతంలోని అనేక దేశాలు కూడా చేరాయి. దీనితో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఈ పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా ఉండే అవకాశం ఉంది. గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు అయిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్ వంటి దేశాల్లో 90 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తూ పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత కంపెనీలు తమ ఉద్యోగుల స్థానాలను గుర్తించి, భద్రతా చర్యలపై సూచనలు ఇస్తూ ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అయితే ఈ పరిస్థితుల అసలు ప్రభావం రాబోయే నెలల్లో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru IT news
  • Commercial LPG price Hike
  • cooking gas shortage India
  • HCLTech Chennai news
  • HCLTech WFH news

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?

  • Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..

  • Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!

  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

  • Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions