PUBG love story: పాకిస్తాన్ మహిళ సీమా హైదర్(30), నోయిడా వ్యక్తి సచిన్ మీనాల(25) ప్రేమ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పబ్జీ గేమ్ ఇద్దరు ప్రేమలో పడేందుకు కారణం అయింది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ ఇద్దరు పరిచయం అయ్యారు. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్, సచిన్ మీనాతో ప్రేమలో పడింది. ఇద్దరు తొలిసారిగా నేపాల్ లో కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత సీమా పాకిస్తాన్ వెళ్లి, తన నలుగురు పిల్లలతో కలిసి మరోసారి నేపాల్ వచ్చి అక్కడ నుంచి బస్సు ద్వారా నోయిడాకు చేరుకుంది.
ఇదిలా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం, ఇతర దేశాలకు చెందిన వ్యక్తి ఆశ్రయం కల్పించడం వంటి కేసులో సీమా, సచిన్ ఇద్దరు అరెస్టయ్యారు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉంటే సీమా తన భర్త హిందువు, భారతీయుడని, ఇప్పుడు నేడు కూడా హిందువు, భారతీయులరాలినే అని ప్రకటించింది. తాను ఇకపై పాకిస్తాన్ వేళ్లేది లేదని, ఇకపై భారతదేశమే నా దేశం అని ప్రకటించింది.
Read Also: Super Scheme : నెలకు రూ.200 పొదుపు చేస్తే.. సంవత్సరానికి రూ..72 వేలు పొందవచ్చు..
ఇదిలా ఉంటే తాను ఇకపై చికెన్ బిర్యానీ విడిచిపెట్టినట్లు తెలిపింది. హిందూ మతంలోకి మారి తులసి పూజ, దేవీదేవతల పూజను ప్రారంభించారు సీమా హైదర్. నమస్కారంతో పెద్దలను పలకరించడంతో పాటు, పాదాలను తాకి ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. సీమ తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ, మాంసం మరియు చేపలను కూడా వదులుకుంది. భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీరించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తన మెడలో రాధే రాధే పట్టిని ధరిస్తున్నారు. తాను ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నారు.
సీమా హైదర్ పాకిస్తాన్ లోని తన ఇళ్లును రూ. 15 లక్షల పాకిస్తాన్ రూపాయలకు అమ్మేసి, ఏడేళ్లలోపు ఉన్న తన నలుగురి పిల్లలతో కలిసి దుబాయ్, నేపాల్ మీదుగా ఇండియాకు చేరుకుంది. భారత పౌరసత్వం పత్రాలకు సంబంధించి ఓ లాయర్ ని సీమా, సచిన్ కలుసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే వీరిద్దరు బెయిల్ పై విడుదలై కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరోవైపు సీమా అసలు భర్త గులాం హైదర్ తన భార్యాపిల్లలను కలిసేందుకు భారత ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాడు. తాను పాకిస్తాన్ వెళ్లనని, ఒక వేళ వెళ్తే తనను చంపేస్తారని సీమా చెబుతోంది.
