NTV Telugu Site icon

Shehla Rashid: ఒకప్పుడు మోడీ విమర్శకురాలు..ఇప్పుడు ‘‘భారతీయులుగా పుట్టడం అదృష్టం’’ అంటూ ప్రధానిపై ప్రశంసలు..

Shehla Rashid

Shehla Rashid

Shehla Rashid: జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకురాలు, ఒకప్పుడు నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించే విమర్శకురాల, ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది. షెహ్లా రషీద్, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భారతీయులుగా పుట్టినందుక చాలా అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక శాంతి, భద్రతకు భరోసా ఇచ్చినందుకు ప్రధాని మోడీ, భారత సైన్యానికి, కేంద్రమంత్రి అమిత్ షాలను ఆమె ప్రశంసించారు.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం వేళ, గాజా ప్రాంతంలో మానవతా సంక్షోభం ఏర్పడింంది. ఉత్తర గాజాను 24 గంటల్లో విడిచిపోవాలని ఇజ్రాయిల్ హెచ్చరించిన నేపథ్యంలో దక్షిణం వైపు లక్షలాది మంది తరలివెళ్తున్నారు. ఈ పరిస్థితి తీవ్ర మానవ సంక్షోభానానికి కారణమైంది.

Read Also: Putin: ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..

‘‘మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే భారతీయులుగా మనం ఎంత అదృష్టవంతులమో ఈ రోజు నేను గ్రహించాను. భారత సైన్యం, భద్రతా దళాలు మన భద్రత కోసం తమ సర్వస్వం త్యాగం చేశారు. ప్రధాని మోడీ, భారతసైన్యం, హోంమంత్రి అమిత్ షాలకు థాంక్స్, కాశ్మీర్‌కి శాంతి చేకూరుతుంది’’ అంటూ షెహ్లా రషీద్ ట్వీట్ చేశారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో చూసినట్లుగా భద్రత లేకుండా శాంతి అసాధ్యం, కాశ్మీర్ లో దీర్ఘకాలిక శాంతి, భద్రతలకు కోసం భారత్ సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ధైర్యసాహసాలు, ఎన్నో త్యాగాలు చేశారని ఆమె పోస్టులో వెల్లడించారు.

ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ పాటు మరికొందరు తుక్డే-తుక్డే గ్యాంగ్ గా ముద్రపడ్డారు. ఫ్రీకాశ్మీర్ అంటూ ఢిల్లీలోని జేఎన్ యూనివర్సిటీలో నినదించారు. ఆ సమయంలో 2016లో షెహ్లా రషీద్ తొలిసారిగా వార్తల్లో నిలిచారు. కాశ్మీర్ లో సాయుధబలగాలు ఇళ్లను దోచుకుని భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తూ 2019లో ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై కేసు నమోదైంది.

ఈ ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తల నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు షెహ్లా రషీద్. కాశ్మీర్ లో మానవహక్కులు మెరుగుపడ్డాయని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలను రక్షిస్తోందని గతంలో షెహ్లా రషీద్ అన్నారు.