Supreme Court: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. సహజీవనం చేస్తే పెళ్లి అయినట్టే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సహజీవనానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సహజీవనం చేసిన జంటకు కలిగిన సంతానం విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఓ జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సహజీవనం చేశారంటే వారిద్దరూ మ్యారేజ్ చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు..
Read Also: Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్
Also Read
కేరళకు చెందిన ఓ జంట సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేయగా.. వారికి ఓ కుమారుడు కూడా పుట్టాడు.. అయితే, ఆ జంట పెళ్లి చేసుకున్నట్లు సాక్ష్యాలు లేని కారణంగా.. ఇది అక్రమ సంతానం.. ఆ సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని పేర్కొంటూ 2009లో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది.. అయితే, ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది.. జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేరళ హైకోర్టు తీర్పును విభేదించింది. ఓ జంట దీర్ఘకాలం పాటు సహజీవనం చేశారంటే వారికి వివాహం జరిగినట్టుగానే భావించాలని.. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 114 ఈ మేరకు సూచిస్తోందని పేర్కొన్నారు. అంతే కాదు, దీనిని ఎవరైనా సవాల్ చేయవచ్చు.. కానీ, వారు వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ఆ సవాల్ చేసినవారిపైనే ఉంటుందని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్‌గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
-
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!