లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విచిత్రంగా ప్రవర్తించారు. ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రసగించిన సమయంలో మొబైల్ చూడడంలో మునిగిపోయారు. మోడీ ప్రసంగించినంత సేపు ఫోన్ చూస్తూనే ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. పదే పదే స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఇది కూడా చదవండి: Mollywood 2024 : ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించిన మాలీవుడ్
శనివారం లోక్‌సభలో భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవంపై చర్చ జరిగింది. చర్చ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చారు. ఏకధాటిగా ప్రధాని మోడీ గంట 50 నిమిషాల పాటు ప్రసంగించారు. మోడీ ప్రసంగించినంత సేపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా పదే పదే హెచ్చరించినట్లుగా సమాచారం అందుతుంది. సభలో ఫోన్ వాడొద్దని రాహుల్‌కి స్పీకర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bollywood : హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఛాన్స్ కొట్టేసిన భామ
రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం జరిగిన చర్చలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ తన ఫోన్‌ను సభలో ఉపయోగించవద్దని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం పదే పదే కోరారు. ముందు వరుసలో కూర్చున్న రాహుల్.. పరధ్యానంగా ఉన్నట్లుగా కనిపించారు. తరచూ ఫోన్‌ని చెక్ చేస్తూనే ఉన్నారు. సహా ఎంపీలతో కబుర్లు చెబుతూనే ఉన్నట్లు కనిపించారు. ప్రియాంక గాంధీ వాద్రా మాత్రం హెడ్‌ఫోన్‌లో ప్రధాని ప్రసంగాన్ని వింటూ కనిపించారు.
ఇది కూడా చదవండి: Roasted Almonds: కాల్చిన బాదంపప్పును తినండి.. ఈ సమస్యలకు గుడ్ బై చెప్పండి