Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పలువురు కీలక నేతలు ఆ పార్టీని వదిలి వెళ్తున్నారు. తాజాగా గుజరాత్ కాంగ్రెస్‌కి చెందిన 200 మంది నాయకులు ఈ రోజు బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌కి మూలస్తంభాలుగా, అట్టడుగు స్థాయి నుంచి నేతలు కాంగ్రెస్‌ని విడిచిపెట్టి బీజేపీలో చేరుతున్నారని, కాంగ్రెస్ మునిగిపోయే నావలా కనిపిస్తోందని, ఆ పార్టీ విభజన, కుల రాజకీయాలపై దృష్టిసారించిందని బీజేపీ అధికార ప్రతినిధి ఆరోపించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: అమిత్ షా.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదు
గుజరాత్ కాంగ్రెస్‌కి నాయకత్వం లేదని, పార్టీ క్షీణిస్తున్న దశలో మేము బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని వారంతా చెప్పారు. దేశ నిర్మాణం కోసం బీజేపీలో చేరుతున్నామని చెప్పారు. పురుషోత్తం రూపాలా, బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని పార్టీ మారిన కాంగ్రెస్ నేత చెప్పారు. అంతకుముందు మే 4న రాజ్‌కోట్ మాజీ మేయర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ దంగర్, బీజేపీ నాయకులు భరత్ బోఘ్రాలు, పురుషోత్తమ్ రూపాలా సమక్షంలో అధికారికంగా బీజేపీలో చేరారు.
మరోవైపు పాటీదార్ వర్గానికి చెందిన పురుషోత్తమ్ రూపాలా ఇటీవల క్షత్రియ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ వర్గం వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రాజ్ పుత్, మొఘలుల మధ్య జరిగిన వివాహాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చివరకు ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. గుజరాత్ మే 7న ఎన్నికలు జరగనున్నాయి.