Women’s Reservation Bill 2026: లోక్‌సభలో సోమవారం మూడు కీలక బిల్లులు.. పూర్తి ఎజెండా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Reservation Bill 2026: దేశ రాజకీయాల్లో సోమవారం (నవంబర్ 30) కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. లోక్‌సభలో మూడు ముఖ్యమైన బిల్లులపై చర్చించి, ఆమోదించే దిశగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను సులభతరం చేయడం, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ఈ బిల్లుల్లో ప్రధానంగా ఉన్నాయి. శనివారం విడుదల చేసిన లోక్‌సభ కార్యక్రమాల జాబితా ప్రకారం.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
1. రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అమలును సులభతరం చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో చర్చకు, ఆమోదానికి ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో మహిళలకు లోక్‌సభతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియకు సంబంధించిన మార్పులు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
Also Read
- Jharkhand: ఆలయ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
- Rahul Gandhi : మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపిస్తున్నారు.. 850 సీట్లు ఎందుకు?
- Karthika Deepam: వందేళ్ల నిరీక్షణకు తెర.. తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం..
2. డీలిమిటేషన్ (రెండో సవరణ) బిల్లు, 2026
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో కీలక బిల్లు కూడా సోమవారం లోక్‌సభ ముందుకు రానుంది. డీలిమిటేషన్ (రెండో సవరణ) బిల్లు, 2026ను న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాలు..
లోక్‌సభలో మహిళలకు రిజర్వు చేసే స్థానాల అమలుకు అవసరమైన మార్పులు చేయడం.
రాష్ట్రాల శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలు కల్పించడం.
కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో స్థానాల కేటాయింపులో సర్దుబాట్లు చేయడం.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన నిబంధనలను రూపొందించడం.
ఈ బిల్లుతో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన నియోజకవర్గాల కేటాయింపు అంశం ప్రాధాన్యత సంతరించుకోనుంది.
3. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (రెండో సవరణ) బిల్లు, 2026
మూడో కీలక బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (రెండో సవరణ) బిల్లు, 2026 ద్వారా శాసనసభలు ఉన్న మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ద్వారా మూడు చట్టాలకు సవరణలు చేయనున్నారు.
కేంద్రపాలిత ప్రాంతాల చట్టం, 1963.
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత చట్టం, 1991.
జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019.
ఈ మార్పులతో ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేయాలని కేంద్రం భావిస్తోంది.
పాత బిల్లులను ఉపసంహరించుకోనున్న కేంద్రం
ఈ మూడు బిల్లులకు సంబంధించి మరో ముఖ్యమైన పరిణామం కూడా చోటుచేసుకోనుంది. గతంలో ఏప్రిల్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టిన అసలు డీలిమిటేషన్ బిల్లు, 2026తో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, 2026ను ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. వాటి స్థానంలో సవరించిన కొత్త బిల్లులను రాజ్యాంగ సవరణ బిల్లుతో కలిపి సభ ముందుకు తీసుకురానుంది.
మూడు బిల్లులపై ఒకేసారి చర్చ
లోక్‌సభ నియమావళిలోని రూల్ 66 ప్రకారం కొన్ని నిబంధనలను నిలిపివేయాలని కోరుతూ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆధారపడిన మిగిలిన రెండు బిల్లులను కూడా కలిపి చర్చించేందుకు ఈ ప్రతిపాదన తీసుకురానున్నారు. దీంతో మూడు బిల్లులపై ఒకేసారి చర్చ జరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు వేడెక్కుతున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు డీలిమిటేషన్ బిల్లులోని అంశాలపై రాజకీయ లెక్కలు వేస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఈ బిల్లుకు మద్దతు ఇస్తోంది. నవంబర్ 30న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ మూడు బిల్లులపై సభలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
-
Women’s Reservation Bill 2026: లోక్‌సభలో సోమవారం మూడు కీలక బిల్లులు.. పూర్తి ఎజెండా ఇదే!
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
-
Koti Deepotsavam 2026: నేడు కన్నులపండుగగా జరగనున్న కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం..! గంగాధరుడికి కోటిరుద్రాక్షల అర్చన..
-
Dhruv Jurel Record: కష్టాల్లోనూ గొప్ప పోరాటం.. చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!