Lok Sabha Elections 2024: బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకుంటాని చెబుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, కొన్ని రోజులకు ఈ కూటమిలోని ఒక్కో పార్టీ వెళ్లిపోయి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాయి. ఇండియా కూటమికి ఆధ్యుడిగా భావించే బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలో చేరి బిగ్ షాక్ ఇచ్చారు. మరోవైపు తృణమూల్ సుప్రిమో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కూటమికి అంటీముట్టనట్లు ఉంటున్నారు.
Read Also: Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియా కూటమిని వదిలిన పార్టీలు ఇవే:
ఆర్ఎల్డీ:
దేశంలో అధికారానికి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో, ముఖ్యంగా రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో ప్రభావం చూపించే జయంత్ చౌదరికి చెందిన ‘రాష్ట్రీయ లోక్ దళ్’ అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం బీజేపీతో జతకట్టింది.
అప్నాదళ్ (కామెరవాడి): కొద్ది రోజుల క్రితం సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో భాగమైన పల్లవి పటేల్, సంకీర్ణాన్ని విడిచిపెట్టి, రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు.
వీబీఏ: ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (VBA) మహా వికాస్ అఘాడిని విడిచిపెట్టింది. మహారాష్ట్రలోని కాంగ్రెస్-శివసేన(యూబీటీ)-ఎన్సీపీ(శరద్ పవార్) నేతృత్వంలోని కూటమిలో సీట్ల షేరింగ్‌లో విబేధాలు రావడంతో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది.
ఎన్సీపీ (అజిత్ పవార్): మహారాష్ట్రలో అత్యంత కీలకమైన ఎన్సీపీ పార్టీలో లుకలుకలు ఆ పార్టీని రెండుగా చీల్చాయి. అయితే, శరద్ పవార్‌ని కాదని అజిత్ పవార్ మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన(షిండే) ప్రభుత్వంలో చేరారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల సపోర్టు కూడా అజిత్ పవార్‌కే ఉంది. ప్రస్తుతం ఎన్సీపీ(అజిత్ పవార్) ఎన్డీయేలో ఉంది.
హెచ్ఏఎం: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా(సెక్యులర్) చీఫ్ జీతన్ రామ్ మాంఝీ గతేడాది ఎన్డీయే కూటమిలో చేరారు. అంతకుముందు కొంతకాలం ఈ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉంది.