Site icon NTV Telugu

Lok Sabha Passed Delhi Services Bill : ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోకసభ ఆమోదం… బిల్‌కి నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్‌

Lok Sabha

Lok Sabha

Lok Sabha Passed Delhi Services Bill: ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోక్‌సభ ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్‌ చేశాయి. విపక్షాల వాకౌట్‌, నిరసనల మధ్య కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును.. ఢిల్లీ సేవల బిల్లు, అధికారికంగా ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు- 2023 అని పిలుస్తారు. ఈ బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదించబడింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనగా వాకౌట్ చేశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చాలా సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణను ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను భర్తీ చేసే ప్రస్తుత ఆర్డినెన్స్‌.

Read also: Space : అంతరిక్షంలో మనుషులు చనిపోతే.. మృతదేహాలను ఏం చేస్తారో తెలుసా?

లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఢిల్లీకి ‘పూర్తి రాష్ట్ర హోదా’ ఇస్తామని బీజేపీ గతంలోనే హామీ ఇచ్చిందని అన్నారు. బదిలీ పోస్టింగ్‌లపై రాష్ట్ర నియంత్రణను తీసివేసే బిల్లుపై నిరాశను వ్యక్తం చేసిన కేజ్రీవాల్, “ఈ రోజు, ఈ వ్యక్తులు (బిజెపి) ఢిల్లీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు” అని అన్నారు. ‘ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ పదే పదే హామీ ఇచ్చింది. 2014లో మోదీ స్వయంగా ప్రధాని అయ్యాక ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఢిల్లీ ప్రజల వెన్నుపోటు పొడిచారు. ఇక నుంచి మోదీ జీని నమ్మొద్దు’’ అని అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ (గతంలో ట్విటర్‌గా పిలిచేవారు)లో పేర్కొన్నారు.

Read also: SIIMA 2022: బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో జక్కన్నతో పోటీలో ఆ నలుగురు కుర్ర దర్శకులు

ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలు అన్ని పక్షాలు పాల్గొన్నాయి. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్‌పై చర్చ సందర్భంగా ఆప్ ఎంపి సుశీల్ కుమార్ రింక్ వెల్‌లోకి దూసుకెళ్లి బిల్ పేపర్లను చింపి స్పీకర్‌ టేబుల్‌పైకి విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. స్పీకర్ టేబుల్ పై కాగితాలు విసిరేసి, సభాగౌరవానికి భంగం కలిగించినందుకు ఆప్‌ ఎంపీ సుశీల్ కుమార్ రింక్‌ను స్పీకర్‌ సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు సభ కార్యక్రమాలకు హాజరుకాకుండా రింకు ను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. చర్చ అనంతరం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభకు సమాధానం ఇచ్చారు. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్‌లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును హోంమంత్రి అమిత్ షా సమర్థించారు.”ఈ ఆర్డినెన్స్ జాతీయ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా అంశంపై చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉందని సుప్రీం కోర్టు ఆదేశాన్ని సూచిస్తుంది. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయి” అని ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు- 2023ని ప్రస్తావిస్తూ అమిత్‌ షా అన్నారు.

Exit mobile version