Lok sabha: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా

  • పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా
  • జూలై 22న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
Loksabhaclose

Loksabhaclose

పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూలై 22న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఇది కూడా చదవండి: Deputy CM: సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్..

×
×
Ad

వాస్తవానికి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే స్పీకర్ ఓం బిర్లా నిరవధిక వాయిదా వేశారు. అలాగే రాజ్యసభ కూడా వాయిదా పడింది. ఆర్థిక బిల్లు మాత్రం ఆమోదం పొందింది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టాన్ని సవరించే బిల్లు కూడా ప్రవేశపెట్టబడింది. నిబంధనలపై నిరసనలు వ్యక్తం కావడంతో పార్లమెంటు సంయుక్త కమిటీకి సిఫార్సు చేశారు.

ఇది కూడా చదవండి: Hit and run: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని యువకుడి మృతి