NTV Telugu Site icon

Lightning strike: యూపీలో ఘోరం.. పిడుగుపాటుకు 38 మంది మృతి

Weather

Weather

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఆకాశంలో ఉరుములు, మెరుపులు హడలెత్తించాయి. భారీ శబ్దాలతో ఉరుములు రావడంతో జనాలు హడలెత్తిపోయారు. ఇక పిడుగుపాటుకు 38 మంది మరణించారు. ప్రతాప్‌గఢ్‌లో 11 మంది, సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మరణించారు. అలాగే ఔరయ్యా, డియోరియో, హత్రాస్, వారణాసి, సిద్ధార్థానగర్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. బాధితులు పొలంలో, చేపలు పట్టే సమయంలో పిడుగుపాటుకు చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Nara Lokesh Whatsapp Block: మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక సూచన

గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్లు దగ్గర.. బయట ఉండొద్దని సూచించారు. ఇళ్లల్లోనే ఉండాలని తెలిపారు. అలాగే ఉరుముల సమయంలో ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు వాడొద్దని సూచించారు.

ఇది కూడా చదవండి: Anant – Radhika Wedding : అనంత్ – రాధిక పెళ్లిలో ఈ “ఛాట్” ప్రత్యేకం..